బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, సౌత్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సికిందర్.మరో 8రోజుల్లో థియేటర్లలోకి రానుంది.మాములుగా సల్మాన్ ఖాన్ సినిమాలు అనగానే హిందీ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి కానీ సికిందర్ కు ఆ పరిస్థితి కనిపించడంలేదు. షూటింగ్ దగ్గరి నుండి ఇప్పటివరకు అంత సైలెంట్ గా వుంది.రీసెంట్ గా వచ్చిన టీజర్ కూడా బజ్ క్రీయేట్ చేయలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే రేపు ఈసినిమా ట్రైలర్ రానుంది.మరి ట్రైలర్ అయినా సినిమా రిలీజ్ కు ముందు సౌండ్ చేస్తుందో చూడాలి.రష్మిక మందన్న ఇందులో హీరోయిన్ గా నటించగా కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో కనిపించనుంది.మురుగదాస్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుంది ఈసినిమా.టాప్ ప్రొడ్యూసర్ సాజిద్ నదియాద్వాలా నిర్మిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రమోషన్స్ కూడా పెద్దగా ఏమి చేయడం లేదు.
ఇక గత కొంత కాలంగా సరైన హిట్ లేక రేస్ లో చాలా వెనకబడ్డాడు సల్మాన్ ఖాన్.ఓ పక్కా షారుక్ ఖాన్ రీసెంట్ గా వరుసగా రెండు సార్లు 1000 కోట్ల క్లబ్ లో చేరి సూపర్ ఫామ్ లోకి రాగ సల్మాన్ మాత్రం స్ట్రగుల్ అవుతున్నాడు.అయితే ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద చావా నెమ్మదించడం సికిందర్ కు అడ్వాంటేజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: