హీరో నితిన్ నుండి ఇక మీదట వచ్చే సినిమాలు మినిమం గ్యారెంటీ అనేలా వున్నాయి.భీష్మ తరువాత నితిన్ కు అలాంటి సాలిడ్ హిట్ పడలేదు.ఈనెల 28 తను రాబిన్ హుడ్ తో రానున్నాడు.ఈసినిమా షూర్ షాట్ హిట్ అయ్యేలానే కనిపిస్తుంది.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు. నితిన్ కూడా ఇంతకుముందు ఎప్పుడు లేనివిధంగా ప్రమోట్ చేస్తూ ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తరువాత నితిన్ ,తమ్ముడు తో రానున్నాడు.వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతుంది.మే లో రిలీజ్ చేయనున్నారు.ఇప్పటివరకు అయితే ఈసినిమా నుండి పెద్దగా అప్డేట్స్ రాలేదు కానీ నితిన్ అయితే సినిమా ఊహించని విధంగా ఉంటుందని అంటున్నాడు.
ఇక ఈసినిమా తరువాత నితిన్ ఎల్లమ్మ అనే సినిమాలో నటించనున్నాడు.మే లేదా జూన్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.బలగం వేణు ఈసినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు.పక్కా రూరల్ బ్యాక్ డ్రాప్ లో రానుంది. ఈసినిమాను కూడా దిల్ రాజే నిర్మించనున్నారు.
ఇవికాకుండా నితిన్ రీసెంట్ గా మరో ప్రాజెక్ట్ కు ఒకే చెప్పాడు.తనకు ఇష్క్ తో హిట్ ఇచ్చి కం బ్యాక్ అయ్యేలా చేసిన డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో నితిన్ మరో సినిమా చేయనున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రానుంది.తనకు చెప్పిన కథను అదేవిధంగా తెరమీదకు తీసుకొస్తే ఈసినిమా నా కెరీర్ లో గేమ్ ఛేంజర్ అవుతుందని నితిన్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.త్వరలోనే ఈసినిమా లాంచ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: