నితిన్ హీరోగా నటించిన హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ‘రాబిన్‌హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా.. శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ రాబిన్‌హుడ్ ట్రైలర్ రిలీజ్ చేయాల్సివుండగా. తాజాగా దీనిని వాయిదా వేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల ఓ ఫన్నీ వీడియోను రిలీజ్ చేసి విషయాన్ని వివరించారు. ఈ సందర్భంగా వీరి ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ తో సంభాషించడం విశేషం. ఈ క్రమంలో రాబిన్‌హుడ్ ట్రైలర్‌ను మార్చి 23న జరిగే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నట్టు తెలిపారు.
కాగా ఈ ఈవెంట్‌కు ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా వస్తుండటం గమనార్హం. ఆయన ఇందులో ఓ క్యామియో రోల్ పోషించిన విషయం తెలిసిందే. ఆదివారం, అనగా రేపు సాయంత్రం హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ వేదికగా రాబిన్‌హుడ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించనుంది చిత్ర బృందం.
ఇక ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ బ్యుటీఫుల్ సినిమాటోగ్రఫీని అందించగా.. కోటి ఎడిటర్‌గా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ గ్రాండ్‌గా నిర్మించిన రాబిన్‌హుడ్ మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: