బ్లాక్ బస్టర్ మ్యాడ్ కు సీక్వెల్ గా వస్తున్న సినిమా మ్యాడ్ స్క్వేర్.నార్నె నితిన్,సంగీత్ శోభన్ ,రామ్ నితిన్ , విష్ణు ఓయ్ లీడ్ రోల్స్ లో నటించగా కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేశాడు.ఈసినిమాపై మొదటి నుండి మంచి అంచనాలు ఉండగా రీసెంట్ గా విడుదలైన టీజర్ మరింత హైప్ తీసుకొచ్చింది.జాతిరత్నాలు తరహా లో ఫుల్ ఫన్ కంటెంట్ తో రానుంది.ఇక ఈసినిమా మరో వారంలో థియేటర్లలో రిలీజ్ కానుండగా ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి.ఇప్పటివరకు ఈసినిమాకు యూఎస్ఏ లో 50K డాలర్ల ప్రీ సేల్స్ జరిగాయి.చిన్న సినిమాకు ఈరెంజ్ బుకింగ్స్ అంటే సాలిడ్ స్టార్ట్ అని చెప్పొచ్చు. అక్కడ ఈసినిమా ఎక్కువ థియేటర్లలో విడుదలకానుంది. దాంతో ప్రీమియర్స్ తోనే 200k దాటనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తెలుగు రాష్ట్రల్లో సాలిడ్ ప్రీ రిలీజ్ బిసినెస్ చేస్తుంది.సినిమా మీద వున్న నమ్మకంతో ప్రముఖ నిర్మాత నాగవంశీ కొన్ని చోట్ల ఓన్ రిలీజ్ చేస్తున్నాడు. ఈసినిమాకు తను సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.నాగవంశీ చెల్లెలు సూర్యదేవర హారిక ,సాయి సౌజన్య ఈసినిమాను నిర్మిస్తున్నారు.హిట్ టాక్ వస్తే ఈసినిమా ఫుల్ రన్ లో 50 కోట్ల మార్క్ దాటనుంది.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.ట్రైలర్ రావాల్సివుంది.
అయితే ఈ సినిమా రిలీజ్ రోజు నితిన్ రాబిన్ హుడ్ కూడా విడుదలకానుంది ఈసినిమాఫై కూడా మంచి అంచనాలు వున్నాయి. దాంతో మ్యాడ్ స్కోర్ కు బాక్సాఫీస్ వద్ద పోటీఎదురుకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: