మలయాళ సినిమా L 2: ఎంపురాన్ అడ్వాన్స్ బుకింగ్ లో అదరగొడుతుంది.సినిమా రిలీజ్ కు ఇంకా ఆరు రోజుల సమయం వున్నా ట్రెడ్ వర్గాలు సైతం ఆశ్ఛర్యపోయేలా బుకింగ్స్ జరుగుతున్నాయి. గంటకు 93.05 K టికెట్లకు పైగా బుకింగ్స్ తో బుక్ మై షో లో ట్రెండ్ అవుతుంది.ఇంతకుముందు ఏ ఇండియన్ సినిమాకు గంటలో ఇన్ని బుక్ అవ్వలేదు.దాంతో L2: ఎంపురాన్ ఆల్ టైం రికార్డ్ నెలకొలిపింది.ఇంతకుముందు 89k పైగా టికెట్స్ తో పుష్ప 2 మొదటి స్థానంలో ఉండేది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక L2: ఎంపురాన్ కు గ్లోబల్ వైడ్ గా ఊహించని రెస్పాన్స్ వస్తుంది.కేవలం ఇండియాలోనే కాదు మిగితా దేశాల్లో కూడా నెక్స్ట్ లెవెల్ బుకింగ్స్ అవుతున్నాయి. ఇప్పటికే ప్రీ సేల్స్ 20 కోట్లు దాటాయి.ఈసినిమా మాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టి అన్ని రికార్డులను బ్రేక్ చేయనుంది.పాజిటివ్ టాక్ వస్తే మాత్రం మొదటి 300కోట్ల మలయాళ సినిమా కానుంది.L2: ఎంపురాన్ పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది.ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈసినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు.బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.
బ్లాక్ బస్టర్ లూసిఫర్ కు రీమేక్ కావడం అలాగే మోహన్ లాల్ ,పృథీరాజ్ సుకుమారన్ ఉండడంతో సినిమాపై అంచనాలు తార స్థాయిలో వున్నాయి.రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కూడా ఆ హైప్ కు తగ్గట్లే వుంది.పృథ్వీరాజ్ సుకుమార్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా ఆశీర్వాద్ సినిమాస్,లైకా ప్రొడక్షన్స్ ,గోకులం మూవీస్ నిర్మించాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: