టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ గ్రాండ్‌గా నిర్మించిన రాబిన్‌హుడ్ మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలను ముమ్మురం చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రాబిన్‌హుడ్ టీమ్ ఐపీఎల్‌లో మెరవనుంది. నేటినుండి ఐపీఎల్ మొదలుకాబోతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో రేపు హైదరాబాద్ వేదికగా మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య తొలిపోరు జరుగనుంది. అయితే ఏ మ్యాచ్ వ్యాఖ్యానానికి రాబిన్‌హుడ్ టీమ్ హాజరు కానుంది. ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్ స్టార్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయనున్న కామెంట్రీ కార్యక్రమంలో పాల్గొననుంది. ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాంలో హీరో నితిన్ మరియు హీరోయిన్ శ్రీలీల సందడి చేయబోతున్నారు.
వీరితోపాటుగా ఈ సినిమాలో క్యామియో రోల్ పోషించిన ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా మెరవనున్నాడు. కాగా వార్నర్ ఇంతకుముందు సన్‌రైజర్స్ టీమ్ తరపున ఎన్నో మ్యాచ్‌లు ఆడిన విషయం తెలిసిందే. ఈ విధంగా రాబిన్‌హుడ్ టీమ్ వినూత్నంగా చేస్తున్న ప్రమోషన్స్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: