మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధానపాత్రలో నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’. 2021లో హిట్ అయిన ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్స్ పై నిర్మాత డి మధు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటీవలే కాశీ లోని ప్రయోగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా వేదికగా టీజర్‌ను లాంచ్ చేసిన విషయం గుర్తుండేవుంటుంది. కాగా మహా కుంభమేళాలో లాంచ్ చేసిన మొట్టమొదటి టీజర్ ‘ఓదెల 2’ కావడం విశేషం. నాగ సాధు పాత్రలో తమన్నా పెరోషియస్, స్టన్నింగ్ పోస్టర్స్ క్యురియాసిటీని పెంచాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి కీలక అప్డేట్ అందించారు మేకర్స్.
ఈ మేరకు తాజాగా ఓదెల 2 రిలీజ్ డేట్ ప్రకటించారు. ఏప్రిల్ 17న ఈ మూవీ థియేటర్లలోకి రానున్నట్టు తెలిపారు. ఇక ఓదెల 2ని మేకర్స్ భారీ బడ్జెట్, హై క్యాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందిస్తున్నారు. ఆడియెన్స్ కి అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది. ఎంగేజింగ్ కథనాలతో థ్రిల్లింగ్ యాక్షన్‌ను బ్లెండ్ చేయడంలో పాపులరైన సంపత్ నంది ఈ చిత్రాన్ని సూపర్ విజన్ చేస్తున్నారు.
కాగా డైనమిక్ టెక్నికల్ టీమ్‌తో ఓదెల 2 ఒక మరపురాని సినీ ప్రయాణంగా రూపొందుతోంది. ‘కాంతార’ ఫేం అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తుండగా.. .ప్రముఖ డీవోపీ సౌందర్‌రాజన్ ఎస్ సినిమాటోగ్రఫీని, ఆర్ట్ డైరెక్షన్ రాజీవ్ నాయర్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి వంటి ప్రముఖ తారాగణం నటిస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: