‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘#SSMB29’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రాజమౌళి, మహేష్ కాంబోలో వస్తోన్న ఫస్ట్ మూవీ కావడంతో దీనిపై అంతటా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే ఒడిశాలోని కోరాపుట్ పర్వత ప్రాంతంలో 15 రోజుల ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది . ఈ సందర్భంగా ఒడిశా ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా దీనిపై స్పందించారు. ఈ సినిమా షూటింగ్ ఒడిశాలో జరగడం తమకు ఎంతో గర్వకారణమని, చిత్ర యూనిట్‌కి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది.
మలయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో నటిస్తున్నట్టు తెలిసింది. అయితే ఇప్పటివరకూ ఆయన ఈ చిత్రంలో నటిస్తున్నారో, లేదో? స్పష్టమైన సమాచారం లేదు. కానీ, తాజాగా పృథ్వీరాజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను SSMB29లో నటిస్తున్నట్టు తెలిపారు. దాదాపు ఒక ఏడాది క్రితం నుంచే ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో తాను భాగమయినట్టు వెల్లడించారు. దీంతో, ఇందులో సూపర్ స్టార్ ఫ్యాన్స్ పృథ్వీరాజ్ ఎలాంటి క్యారక్టర్ చేస్తున్నారో? అని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: