టాక్సిక్ రిలీజ్ డేట్ ఫిక్స్

Rocking Star Yash' Toxic Release Date Announced

‘కేజీఎఫ్’ సిరీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న కన్నడ స్టార్ హీరో యష్‌ ప్రస్తుతం హీరోగా ‘టాక్సిక్‌’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో తన జన్మదినం సందర్భంగా ఈ మూవీ నుంచి ‘బర్త్ డే పీక్’ పేరుతో ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేసి తన అభిమానులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ అందించాడు యష్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో సాలిడ్ అప్డేట్ అందించాడు హీరో యష్. టాక్సిక్‌ మూవీ వచ్చే ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నట్టు తెలిపాడు. ఈ మేరకు యష్ నేడు స్వయంగా తన ఎక్స్ ఖతా ద్వారా అధికారికంగా ప్రకటించాడు. కేజీఎఫ్ 2 విడుదలైన దాదాపు నాలుగేళ్ళ తర్వాత టాక్సిక్ రిలీజ్ కానుండటంతో రాకింగ్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పటినుంచే దీనికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ మూవీ పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కుతుండటం గమనార్హం. టాక్సిక్ ఇంగ్లీష్ మరియు కన్నడ రెండింటిలోనూ చిత్రీకరించబడింది. అలాగే అనేక భారతీయ మరియు అంతర్జాతీయ భాషలలోకి ఇది డబ్బింగ్ చేయబడుతోంది. దీనినిబట్టి టాక్సిక్ సినిమా వరల్డ్‌వైడ్‌గా భారీ స్థాయిలో విడుదలకానున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే, హీరో యష్ రేంజ్ గ్లోబల్ స్థాయికి చేరడం పక్కా.

ఇక కంప్లీట్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పోరాట ఘట్టాలు ఓ రేంజ్‌లో ఉంటాయని తెలుస్తోంది. దీనికోసం పనిచేయడానికి హాలీవుడ్ టెక్నిషియన్స్ రంగంలోకి దిగుతున్నారు. ‘జాన్ విక్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, మరియు డే షిఫ్ట్’ తదితర హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన యాక్షన్ డైరెక్టర్ జేజే పెర్రీ టాక్సిక్ మూవీ కోసం పనిచేయనున్నాడు.

కాగా ‘ఎ ఫెయిరీ టెల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’ అనేది ఉపశీర్షికగా ఉన్న ఈ సినిమాకు ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. KVN ప్రొడక్షన్స్ మరియు మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మాత వెంకట్‌ కె.నారాయణతో కలిసి యష్‌ స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. కేజీఎఫ్ సిరీస్ తరువాత యష్‌ నుంచి వస్తోన్న చిత్రం కావడంతో ఈ టాక్సిక్‌ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.