కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 153

ashish reddy and vaishnavi chaitanyas love me movie streaming now
ఓటీటీ

స్ట్రీమింగ్ కు వచ్చేసిన లవ్ మీ

ఆశిష్ రెడ్డి హీరోగా బేబి సినిమాతో క్రేజ్ ను సొంతం చేసుకున్న వైష్ణవి చైతన్య హీరోయిన్ గా వచ్చిన సినిమా లవ్ మీ. లవ్ ప్లస్ హారర్ర నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలో కూడా సందడి చేయడానికి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వారు ఈసినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా స్ట్రీమింగ్ డేట్ ను ఇప్పటికే ప్రకటించారు. దీనిలో భాగంగానే ఈసినిమా నేటి నుండి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. సినిమా రిలీజ్ అయిన మూడు వారాలకి ఈసినిమా స్ట్రీమింగ్ కు వచ్చేయడం విశేషం. ప్రస్తుతానికి తెలుగులో ఈసినిమా అందుబాటులోకి వచ్చింది.

TFN Adminవాట్సాప్
special video update from sree vishnu swag movie
సినిమా వార్తలు

స్వాగ్- రేజర్ అంటూ రానున్న స్పెషల్ వీడియో

హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా స్వాగ్ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో రాజరాజచోర సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి హిట్ నే అందించింది. దీంతో ఈసినిమా పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈసినిమా నుండి రోజుకో అప్ డేట్ ఇస్తూ సినిమాపై క్రేజ్ ను పెంచేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి రేజర్ అన్న పేరుతో స్పెషల్ వీడియోను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు చిత్రబృందం.

TFN Adminవాట్సాప్
thangalaan and lucky baskhar movies first single update
సినిమా వార్తలు

లక్కీ భాస్కర్, తంగలాన్ ఫస్ట్ సింగిల్ అప్ డేట్

జీవి ప్రకాష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ్ లో, తెలుగులో పలు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను అందించాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో మోస్ట్ అవైటెడ్ సినిమాస్ లక్కీ భాస్కర్ ఇంకా తంగలాన్ సినిమాలు కూడా ఉన్నాయి. జీవీ ప్రకాష్ తాజాగా తన సోషల్ మీడియా ద్వారా ఈసినిమాల గురించి స్పందిస్తూ.. లక్కీ భాస్కర్, తంగలాన్ సినిమాల ఫస్ట్ సింగిల్స్ రెడీ అయిపోయాయి.. ప్రొడ్యూసర్స్ కు కూడా హ్యాండ్ ఓవర్ చేశారను.. త్వరలోనే రెండు పాటలకు సంబంధించిన అప్ డేట్లు రానున్నాయి అంటూ తెలిపాడు.

TFN Adminవాట్సాప్
Shruti Haasan Joins The Sets of Adivi Sesh’s Pan Indian Film Dacoit
షూటింగ్ అప్‌డేట్

అడివి శేష్ 'డకాయిట్' షూటింగ్‌లో జాయిన్ అయిన శృతి హాసన్

'మేజర్' సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందాడు టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్. ప్రస్తుతం ఆయన ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డకాయిట్’. అడివి శేష్ గతంలో నటించిన 'క్షణం', 'గూఢచారి'తో సహా పలు తెలుగు బ్లాక్‌బస్టర్‌లకు డివోపీగా పనిచేసిన షానీల్ డియో ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి అడివి శేష్, షానీల్ డియో కథ స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఈ మూవీలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా శేష్, శ్రుతి జంటగా నటిస్తున్న తొలి చిత్రం ఇదే.

Srikanth Mవాట్సాప్
Devara to be Release on September 27
సినిమా వార్తలు

అఫీషియల్.. ముందుగానే వచ్చేస్తున్న దేవర

టాలీవుడ్ యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ఆకట్టుకున్నాయి. మరోవైపు 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఇప్పటివరకు జూనియర్ నుంచి సినిమా రాలేదు. దీంతో దేవర సినిమా అప్‌డేట్స్ గురించి తారక్ ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక కీలక అప్‌డేట్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Actor Joju George Injured on The Sets of Mani Ratnam’s Thug Life
షూటింగ్ అప్‌డేట్

థగ్‌ లైఫ్‌ షూటింగ్‌లో ప్రమాదం.. స్టార్‌ నటుడికి గాయాలు

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ 'థగ్‌ లైఫ్‌'. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. కాగా పొన్నియిన్ సెల్వన్ 2 తరువాత లెజండరీ డైరెక్టర్ మణిరత్నం నుండి వస్తున్న సినిమా ఇదే. ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి, త్రిష ఫీమేల్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. యంగ్ హీరోలు శింబు, గౌతమ్‌ కార్తీక్‌, అశోక్ సెల్వన్ మరియు పాపులర్ మాలీవుడ్ యాక్టర్‌ జోజు జార్జ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పాండిచ్చేరిలో జరుగుతుంది. అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Kalki 2898 AD Beats RRR Record in USA
సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ రికార్డుని బ్రేక్ చేసిన కల్కి 2898 AD

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 AD’. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీకి క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ఫిమేల్ లీడ్ రోల్ పోషించగా.. మరొక నటి బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలక పాత్రలో కనిపించనుంది. గ్లోబల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, విశ్వ నటుడు కమల్ హాసన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Tweets on Special Talk with PM Modi
సినిమా వార్తలు

ప్రధాని మోదీ.. నాతో ఏం చెప్పారంటే? - మెగాస్టార్

మెగా బ్రదర్స్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటామంతి.. కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న విషయం. నేషనల్ మీడియాలో సైతం ఈ వార్తకు అధిక ప్రాధాన్యం లభించిందంటే అర్ధం చేసుకోవచ్చు ఇది ఎంత సెన్సేషన్ అయిందో. ఈ అపూర్వ సన్నివేశానికి వేదికైంది మాత్రం ఆంధ్రప్రదేశ్‌. బుధవారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా మొత్తం 24 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు.

Srikanth Mవాట్సాప్
Kalki 2898 AD Team Extends Birthday Wishes To Actress Disha Patani
సినిమా వార్తలు

దిశా పటానీకి బర్త్ డే విషెస్ తెలిపిన కల్కి టీమ్

ప్రముఖ బాలీవుడ్ నటి దిశా పటానీ నేడు పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు 'కల్కి 2898 AD' బృందం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా దిశా పటానీకి బర్త్ డే విషెస్ తెలిపిన కల్కి టీమ్.. మూవీలో ఆమె పేరుని రివీల్ చేసింది. "మా 'రాక్సీ' దిశా పటానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు" అని అందులో పేర్కొంది. సో.. దీనిని బట్టి కల్కిలో దిశా పటానీ పేరు రాక్సీ అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ఆమె ఓ కీలక రోల్ పోషించనుంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌ను గమనిస్తే ఇది అర్ధమవుతుంది.

Srikanth Mవాట్సాప్
Harom Hara Movie Team Launched The Release Teaser
ట్రైలర్ & టీజర్

హరోంహర నుంచి రిలీజ్ టీజర్ లాంఛ్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరోంహర’. ‘ది రివోల్ట్‌’ అనేది ఉపశీర్షిక. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సునీల్ ర‌వి కాలే, కేజీఎఫ్ ఫేమ్ ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్, అర్జున్ గోవిందా కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సుమంత్‌ జి.నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ చిత్రం జూన్ 14న‌ విడుద‌ల కానుంది.

Srikanth Mవాట్సాప్
Kalki 2898 AD Anand Mahindra Riding on Bujji, Video Goes Viral
సినిమా వార్తలు

క‌ల్కి బుజ్జిపై ఆనంద్‌ మహీంద్ర రైడింగ్.. వీడియో వైరల్

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 AD’. క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ నటులు నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో దీపికా పదుకొణే ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. మరొక హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలక పాత్రలో కనిపించనుంది. వైజయంతి మూవీస్‌ పతాకంపై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీ దత్‌ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
manchu vishnu kannappa movie teaser release venue update
ట్రైలర్ & టీజర్

కన్నప్ప టీజర్ రిలీజ్ వేదిక ఫిక్స్

ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. మరోవైపు విష్ణు మాత్రం షూట్ కు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు.

TFN Adminవాట్సాప్
Rajinikanth, Chiranjeevi, Balakrishna Shines at Pawan Kalyan Oath Taking Ceremony
సినిమా వార్తలు

ఒకే వేదికపై రజినీకాంత్‌, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్

ఇండియాలో సినిమా హీరోలు అంటే ఓ రేంజ్‌లో క్రేజ్ ఉంటుంది. అదే దక్షిణాదిలో అయితే ఇక చెప్పనే అక్కరలేదు. స్టార్‌డమ్ ఉన్న ప్రతి నటుడికి లక్షల్లో అభిమానులు ఉంటారు. ఇక ఎప్పుడైనా ఏదయినా సందర్భంలో ఇద్దరు అగ్ర హీరోలు ఒకేచోట కనిపిస్తే వారి అభిమానులకు పండుగే. అలాంటిది ఒకే వేదికపై ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు అగ్ర తారలు కనిపిస్తే ఊహించుకోవడానికే వాహ్ అనిపిస్తుంది కదా.! అదే నిజమైతే ఆయా హీరోల ఫ్యాన్స్ ఆనందానికి హద్దే ఉండదు. ఇలాంటి సందర్భమే తాజాగా ఒకటి చోటుచేసుకుంది.

Srikanth Mవాట్సాప్
Chandrababu Oath Taking Ceremony PM Modi Special Talk with Rajinikanth and Chiranjeevi
సినిమా వార్తలు

మెగాస్టార్‌, సూపర్‌స్టార్‌ల వద్దకు ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా బుధవారం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా మొత్తం 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి వద్ద అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

Srikanth Mవాట్సాప్
ika na maate full video song out from manamey movie
సాంగ్

మనమే-ఇక నామాటే ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

మొత్తానికి చాలా గ్యాప్ తరువాత శర్వానంద్ డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్ గా తన నుండి వచ్చిన సినిమా మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా వచ్చింది ఈసినిమా. లవ్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా శర్వా ఎనర్జిటిక్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ నే రాబట్టుకుంటుంది. ఫస్ట్ వీకెండ్ కు ఈసినిమా 13 కోట్లకు పైగా కలెక్షన్స్ ను దక్కించుకుంది. ముందు ముందు ఈకలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

TFN Adminవాట్సాప్
Renu Desai Congratulates Pawan kalyan After He Takes Oath as AP Minister
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్‌కు రేణు దేశాయ్ స్పెష‌ల్ విషెస్

టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఇక అంతకుముందు ఏపీ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. కాగా జనసేన పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారిగా ఎక్కువ స్థానాలు (21) గెలుచుకోవడంతోపాటు ఆయన కూడా స్వయంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో నెగ్గిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
pawan kalyan powerful poster out from ustaad bhagat singh movie
ఫస్ట్ లుక్

ఉస్తాద్ భగత్ సింగ్ నుండి పవన్ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే కదా. విజయవాడ దగ్గరలోని కేసరపల్లి ఐటీ పార్క్ లో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈకార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయగా ఆతరువాత మంత్రులు ఒక్కొక్కరిగా ప్రమాణం చేశారు. ఈనేపథ్యంలోనే గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నేతృత్వంలో పవన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయరు. ఇక మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌డంతో రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు జ‌న‌సేనానికి శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

TFN Adminవాట్సాప్
gopichand special birthday poster out from viswam movie
ఫస్ట్ లుక్

గోపీచంద్ విశ్వం మూవీ-స్టైలిష్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

టాలీవుడ్ మ్యాచోో హీరో శ్రీనువైట్లకు సాలిడ్ హిట్ దక్కి చాలా కాలమైపోయింది. వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నా కూడా ఎందుకో సరైన హిట్ అనేది రావట్లేదు. రీసెంట్ గా భీమా సినిమాతో వచ్చాడు ఆసినిమా కూడా అయినా కూడా ఎక్కడా కృంగిపోకుండా గోపీచంద్ మంచి సినిమా తన ఫ్యాన్స్ కు ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా విశ్వం. ఢీ, రెడీ, దూకుడు లాంటి సినిమాలతోో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీనువైట్ల తో ఈసినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
pawan kalyan take oath as andhra pradesh minister
సినిమా వార్తలు

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు ఎంతో ఉత్కంఠంగా జరిగాయి. అందుకు పదిరెట్లు ఉత్కంఠతతో ఏపీ ఎన్నికల ఫలితాల రిజల్ట్ కోసం అందరూ ఎదురుచూశారు. ఆ రిజల్ట్ జూన్ 4వ తేదీన వచ్చేసింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అంతేకాదు ఈ కూటమి దేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించింది. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి పదవిని అధిరోహించడానికి ఈ కూటమి ఎంతగానో తోడ్పడింది. ఈనేపథ్యంలోనే మోడీ మూడీసారి ప్రధానిగా ఎన్నికయ్యారు.

TFN Adminవాట్సాప్
Superstar Rajinikanth Attends AP CM Chandrababu Naidu Oath Taking Ceremony
సినిమా వార్తలు

చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. హాజరైన రజినీకాంత్

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ఆయన ఆంధ్రప్రదేశ్ మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే సినీ, వ్యాపార సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్