ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. మరోవైపు విష్ణు మాత్రం షూట్ కు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా తెలుగు టీజర్ రిలీజ్ డేట్ ను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. జూన్ 14వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. టీజర్ రిలీజ్ వేదికను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. హైద్రాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో మధ్యాహ్నం 2 గంటలకు టీజర్ రిలీజ్ చేయనున్నారట.
కాగా ఈసినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కాజల్, మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, ప్రీతి ముకుందన్, బ్రహ్మానందం పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాతోనే మంచు ఫ్యామిలీ థర్డ్ జనరేషన్ విష్ణు తనయుడు అవ్రామ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈసినిమాను అవా ఎంటర్టైన్మెంట్ ఇంకా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంయుక్తంగా ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























