టాలీవుడ్ యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ఆకట్టుకున్నాయి. మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఇప్పటివరకు జూనియర్ నుంచి సినిమా రాలేదు. దీంతో దేవర సినిమా అప్డేట్స్ గురించి తారక్ ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు తారక్ అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించింది చిత్ర బృందం. అదేంటంటే..? ‘దేవర’ మొదటి భాగం ప్రకటించిన డేట్ కంటే ముందుగానే విడుదలవుతోంది. ఇందుకు సంబంధించి మేకర్స్ గురువారం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. దీనిప్రకారం దేవర సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే వాస్తవానికి మేకర్స్ తొలుత అనుకున్న డేట్ అక్టోబర్ 10. దసరా పండుగ కానుకగా విడుదల చేయడానికి నిర్ణయించారు. కానీ, అనూహ్యంగా రెండు వారాల ముందుగానే రిలీజ్ చేయడానికి నిశ్చయించుకుంది చిత్ర బృందం. ఈ సందర్భంగా.. “అన్ని తీర ప్రాంతాలకు హెచ్చరిక.. దేవర త్వరగా వస్తున్నాడు” అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
దీనికి ప్రధాన కారణం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’. నిజానికి ఓజీ సెప్టెంబర్ 27న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే, తాజాగా మారిన పరిస్థితులు కారణంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వలన ఆ మూవీ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఇది పూర్తి కావడానికి మరికొన్ని రోజులు పెట్టే అవకాశం ఉంది. అలాగే దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తోన్న ‘లక్కీ భాస్కర్’ కూడా అదే తేదికి విడుదల కావాల్సి ఉండగా, అది కూడా వాయిదా పడినట్లు సమాచారం. దీంతో మేకర్స్ దేవరను ముందుగా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.
భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్, సంయుక్తంగా నిర్మిస్తున్న ‘దేవర’ చిత్రానికి శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా.. సాబు సిరిల్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా తర్వాత తారక్ ‘వార్ 2’ సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టబోతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై థ్రిల్లర్‌లో హృతిక్ రోషన్‌తో కలిసి ఆయన నటించనున్నారు. అలాగే ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ భారీ చిత్రం చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























