
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 154


గుడ్ బ్యాడ్ అగ్లీ లో సునీల్

గుమ్మడికాయ కొట్టేసిన ‘దేవకీ నందన వాసుదేవ’

డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ అప్డేట్

హరోం హర సెన్సార్ రిపోర్ట్

కల్కి నుండి మరో ట్రైలర్ కూడా

మహారాజ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది

ఘనంగా అర్జున్ కుమార్తె వివాహం

అమెరికాలో రౌడీహీరో క్రేజ్

మిస్టర్ బచ్చన్ త్వరలో రిలీజ్ డేట్

స్వాగ్ మూవీ మగజాతి ఆణిముత్యాలు

కల్కి 2898 ఏడీ ట్రైలర్ హైలైట్స్

రవితేజ, శ్రీలీల జంటగా RT75 ప్రారంభం

మనమే డీసెంట్ 3 డేస్ కలెక్షన్స్

రాయన్ రిలీజ్ డేట్ ఫిక్స్

సికందర్ ఎప్పుడు స్టార్ట్ కానుందంటే

ఈవారం విడుదలకానున్న సినిమాలు ఇవే

సరిపోదా శనివారం- గరం గరం గా ఫస్ట్ సింగిల్
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం. అంటే సుందరానికి సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఈసినిమాతో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు నాని. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఇంకా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు.

గుడ్ బ్యాడ్ అగ్లీ లో సునీల్
పుష్ప తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీ అయ్యాడు సునీల్. ఈసినిమా అతనికి కోలీవుడ్ లో కూడా ఆఫర్లను తెచ్చిపెట్టింది.రీసెంట్ గా జైలర్ లో అలాగే మహావీరుడు ,మార్క్ ఆంటోనీ సినిమాల్లో కనిపించాడు సునీల్.ఇందులో జైలర్ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వగా మిగితా రెండు సూపర్ హిట్ అయ్యాయి.ఇక సునీల్ ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ను అందుకున్నాడు.

హరోం హర యాక్షన్, క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది-జ్ఞానసాగర్
హీరో సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'హరోం హర'. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌కి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి. టీజర్, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ హైప్ క్రియేట్ చేశాయి. జూన్ 14న హరోం హర గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ జ్ఞానసాగర్ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

గుమ్మడికాయ కొట్టేసిన ‘దేవకీ నందన వాసుదేవ’
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'దేవకీ నందన వాసుదేవ'. 'గుణ 369' ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాజీ మిస్ ఇండియా మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ చిత్రానికి 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ కథను అందిస్తుండటం విశేషం. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన టీజర్, ఫస్ట్ సింగిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. స్పెషల్ గెస్ట్‌గా మెగాస్టార్
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాగా విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఒక పర్యాయం ఐదేళ్లు పరిపాలించిన ఆయన ఇప్పుడు రెండోసారి సీఎం పదవిని అలంకరించనున్నారు.

డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ అప్డేట్
స్కంద తరువాత రామ్ నుండి వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్.బ్లాక్ బాస్టర్ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తుంది.రీసెంట్ గా రిలీజైన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్నాడు.చాలా గ్యాప్ తరువాత రీసెంట్ గా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది.ఇక ఈ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.మరో మూడు పాటల షూట్ బ్యాలెన్స్ వుంది.అందులో రెండు పాటలను హైదరాబాద్ లో మరొకటి గోవాలో చిత్రీకరించనున్నారు.

హరోం హర సెన్సార్ రిపోర్ట్
విభిన్నమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు. కుప్పం నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇప్పటికే ఈసినిమా కావాల్సింది కానీ పలు కారణాల వల్ల వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఫైనల్ గా జూన్ 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్లు సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. దీంతో సినిమాకు మంచి హైపే క్రియేట్ అయింది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. సెన్సార్ బృందం ఈసినిమాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్టు సమాచారం. కొంచం వయోలెంట్…

కల్కి నుండి మరో ట్రైలర్ కూడా
ప్రభాస్ కల్కి 2898 ఏడి నుండి ట్రైలర్ వచ్చేసింది.ఈ ట్రైలర్ కు యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.స్టన్నింగ్ విజువల్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.నాగ్ అశ్విన్ సృష్టించిన మరో ప్రపంచం బిగ్ స్క్రీన్ మీద రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.ట్రైలర్ లో ప్రభాస్, దీపికా, అమితాబ్ తోపాటు చివర్లో కమల్ హాసన్ ను కూడా చూపెట్టారు.కమల్ గెటప్ అయితే గుర్తుపట్టలేనట్లుగా వుంది. ఎవరికి వారే సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు.ఇలా చాలా సప్రైజ్ లతో వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను డబుల్ చేసింది.

మహారాజ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
కోలీవుడ్ స్టార్ నటుడు, మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగానే కాకుండా విలక్షణ పాత్రలకు పెట్టింది పేరు. క్యారక్టర్ నచ్చితే అది ఎలాంటిదైనా సరే నటించడానికి సంసిద్ధంగా ఉంటాడు. తెలుగులో ఆయన 'ఉప్పెన' సినిమాలో విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్‌లో 'జవాన్,' 'ఫర్జీ,' మరియు 'మెర్రీ క్రిస్ట్‌మన్' తదితర చిత్రాలలో నటించి పాన్ ఇండియా స్థాయిలో ప్రసిద్ధి చెందాడు. ఇదే కోవలో ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు మరో విభిన్న చిత్రంలో నటించాడు.

ఘనంగా అర్జున్ కుమార్తె వివాహం
యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. తన సినిమాలతో తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు. ఇక అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం కూడా ఫిక్స్ అయిపోయిన సంగతి తెలిసిందే. ప్రముఖ తమిళ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో గత ఏడాది అక్టోబర్ నెలలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. రెండు రోజుల నుండి హల్టీ వేడుకలు, సంగీత వేడుకలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలు అవుతూనే ఉన్నాయి. ఇక నిన్న జూన్ 10 న చెన్నైలోనీ అంజనాసుత శ్రీ యోగంజనేయస్వామి మందిరంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. రిసెప్షన్ జూన్ 14 న చెన్నయ్ లీలా ప్యాలెస్ లో…

విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ హీరోగా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. కృష్ణచైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశ్వక్ సరసన నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. మే 31న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక జూన్ 14న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

అమెరికాలో రౌడీహీరో క్రేజ్
విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ లో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న పాత్ర ద్వారా మొదలైన తన సినీ కెరీర్ ఇప్పుడు ఏ స్థాయికి చేరిందో చూస్తూనే ఉన్నాం. కెరీర్ స్టార్టింగ్ లోనే పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా ఇలా సూపర్ హిట్లను అందుకోవడంతో విజయ్ దేవరకొండ క్రేజ్ పూర్తి మారిపోయింది. అయితే ఈమధ్య వరుసగా ఫ్లాప్స్ మూటగట్టుకున్నాడు. గత ఏడాది వచ్చిన ఖుషి మాత్రమే కాస్త డీసెంట్ హిట్ ను అందించింది. మళ్లీ ఈఏడాది ఫ్యామిలీస్టార్ సినిమాతో డిజాస్టర్ ను అందుకున్నాడు.

మిస్టర్ బచ్చన్ త్వరలో రిలీజ్ డేట్
రవితేజ నుండి రీసెంట్ గా వచ్చిన సినిమా ఈగల్. ఈసినిమా అయితే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినా కూడా రవితేజ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టేశాడు. ప్రస్తుతం తన నుండి రాబోతున్న సినిమా మిస్టర్ బచ్చన్ సినిమా. ఈసినిమా హిందీలో వచ్చిన రెయిడ్ సినిమాకు రీమేక్ అంటున్నారు. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈసినిమా అక్కడ సూపర్ హిట్ అయింది.

స్వాగ్ మూవీ మగజాతి ఆణిముత్యాలు
గత ఏడాది సామజవరగమన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు.. ఈ ఏడాది ఓం భీమ్ బుష్ సినిమాతో సెకండా హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక బ్యాక్ టు బ్యాక్ హిట్లను ను అందుకున్న శ్రీ విష్ణు ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. శ్రీవిష్ణు హీరోగా త్వరలో రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా స్వాగ్. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన గ్లింప్స్ కానీ పోస్టర్లు మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

కల్కి 2898 ఏడీ ట్రైలర్ హైలైట్స్
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించారు. దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ముందుగా ప్రకటించినట్లు సోమవారం రాత్రి కల్కి ట్రైలర్ రిలీజ్ చేసింది. ఊహించినట్లే ఈ సినిమా ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉంది. ప్రభాస్ అభిమానులకే కాకుండా సినీ ప్రియులు అందరికీ కల్కి…

రవితేజ, శ్రీలీల జంటగా RT75 ప్రారంభం
మాస్ మహారాజా రవితేజ ఎందరో ఔత్సాహిక దర్శకులకు, నటీనటులకు స్ఫూర్తి. తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, మాస్ యాటిట్యూడ్, విలక్షణమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. స్వయంకృషితో స్టార్ గా ఎదిగిన రవితేజ, యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. అలా యువ దర్శకులతో పని చేసి పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను, గుర్తుండిపోయే పాత్రలను అందించారు.

మనమే డీసెంట్ 3 డేస్ కలెక్షన్స్
కెరీర్ ప్రారంభం నుంచీ తనదైన చిత్రాలతో అలరిస్తూ వస్తున్నాడు శర్వానంద్. ఇక రీసెంట్ గా తన నుండి వచ్చిన సినిమా మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా హిట్ టాక్ నే సొంతం చేసుకుంది. సినిమా మొత్తం చిన్న పిల్లాడి చుట్టూనే తిరుగుతుంది. ఈనేపథ్యంలోనే శర్వానంద్, కృతి శెట్టి మధ్య వచ్చే సన్నివేశాలు, శర్వానంద్ కామెడీ టైమింగ్, ఎమోషనల్ కంటెంట్ ఇలా అన్నీ సినిమా హిట్ లో ప్రధాన భాగమయ్యాయి.

రాయన్ రిలీజ్ డేట్ ఫిక్స్
ధనుష్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తన లిస్ట్ లో ప్రస్తుతం పలు సినిమాలు ఉండగా అందులో తన దర్శకత్వంలో వస్తున్న రాయన్ సినిమా కూడా ఒకటి ఉంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇప్పటికే రెండు పాటలను కూడా రిలీజ్ చేశారు. తలవంచి ఎరుగడే, పీచు మిఠాయి అంటూ వచ్చే రెండు పాటలను రిలీజ్ చేశారు. రెండు పాటలు కూడా మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నాయి.

సికందర్ ఎప్పుడు స్టార్ట్ కానుందంటే
సౌత్ టాప్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో సినిమా చేయనున్నాడని తెలిసిందే. సికిందర్ అనే టైటిల్ తో రానుంది.ఈసినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించనుండగా టాప్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్‌వాలా నిర్మించనున్నాడు.ఈసినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అవుతుంది.ఈనెల 18నుండి ముంబై లో మొదటి షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్ లో ఎయిర్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.వచ్చే ఏడాది ఈద్ కు సికిందర్ రిలీజ్ కానుంది.

ఈవారం విడుదలకానున్న సినిమాలు ఇవే
రెండు వారాలనుండి తెలుగులో కొత్త సినిమాల విడుదల జోరు అందుకుంది.ఈవారం కూడా కొన్ని సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాయి. అందులో సుధీర్ బాబు హరోం హర ,తమిళ నటుడు విజయ్ సేతుపతి మహారాజ వీటితోపాటు యేవమ్ ,మ్యూజిక్ షాప్ మూర్తి అనే చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి.