
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 152


కన్నప్ప నా బిడ్డలాంటిది - విష్ణు మంచు

మనమే చాలా ఎంజాయ్ చేశా

కొరటాల శివకు బర్త్ డే విషెస్ చెప్పిన దేవర టీమ్

రవితేజ డెడికేషన్‌కి హరీష్ శంకర్ ఫిదా

పవన్ కు డిప్యూటీ సీఎం, పలు శాఖల కేటాయింపు

విశ్వంభర లోకి మరో టాలెంటెడ్ నటుడు

రివ్యూ : మహారాజ

కన్నప్ప టీజర్ రిలీజ్- విజువల్ ట్రీట్

అక్షయ్ కుమార్ 'సర్ఫిరా' రిలీజ్ డేట్ ఫిక్స్

అఫీషియల్.. డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ డేట్ ఖరారు
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'డబుల్ ఇస్మార్ట్'. వీరి కలయికలో 2019లో వచ్చి సూపర్ హిట్టైన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రను పోషిస్తుండగా.. మరి కొందరు ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

కన్నప్ప మైథాలజీ కాదు, నిజంగా జరిగిన కథ - విష్ణు మంచు
టాలీవుడ్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన తాజా చిత్రం ‘కన్నప్ప’. భక్తిరస ప్రధానంగా రూపొందిన ఈ సినిమాకి బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద విష్ణు తండ్రి, సీనియర్ నటుడు డా.మోహన్ బాబు నిర్మించారు. ఇక ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు భాగమయ్యారు.

కన్నప్ప నా బిడ్డలాంటిది - విష్ణు మంచు
టాలీవుడ్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన తాజా చిత్రం ‘కన్నప్ప’. భక్తిరస ప్రధానంగా రూపొందిన ఈ సినిమాకి బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద విష్ణు తండ్రి, సీనియర్ నటుడు డా.మోహన్ బాబు నిర్మించారు. ఇక ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు భాగమయ్యారు.

ఉస్తాద్ భగత్ సింగ్ ఇంట్రెస్టింగ్ వర్కింగ్ స్టిల్
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి సినిమాను ప్రకటించినప్పటి నుండే అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం అయితే షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను అలానే పలు పోస్టర్లు రిలీజ్ చేయగా అవి సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ప్రస్తుతం అయితే షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొంత మేరుక షూటింగ్ పూర్తి చేసుకున్నారు కూడా.

కన్నప్ప.. ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతోనే తీశాం - మోహన్ బాబు
టాలీవుడ్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన తాజా చిత్రం ‘కన్నప్ప’. భక్తిరస ప్రధానంగా రూపొందిన ఈ సినిమాకి బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద విష్ణు తండ్రి, సీనియర్ నటుడు డా.మోహన్ బాబు నిర్మించారు. ఇక ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు భాగమయ్యారు.

మిస్టర్ బచ్చన్ సెట్స్‌లో రవితేజ ఫ్యాన్, ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ రివీల్
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ బచ్చన్'. 'నామ్ తో సునా హోగా' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా.. సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. దర్శకుడు హరీష్ శంకర్, జగపతి బాబు పాత్రని పవర్ ప్యాక్‌డ్‌గా ప్రజెంట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన టైటిల్ పోస్టర్‌లో హీరో రవితేజ తన ఫేవరేట్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ పోజ్‌లో కనిపించి అలరించిన విషయం తెలిసిందే.

మనమే చాలా ఎంజాయ్ చేశా
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా మనమే. లవ్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా శర్వా ఎనర్జిటిక్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ నే రాబట్టుకుంటుంది. ఈసినిమాలో విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు.

సరిపోదా శనివారం-ఫస్ట్ సింగిల్ గరం గరం సాంగ్ రిలీజ్
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా సరిపోదా శనివారం. యాక్షన్ ఎంటర్ టైనర్ గా భారీ బడ్జెట్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, పలు పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

కొరటాల శివకు బర్త్ డే విషెస్ చెప్పిన దేవర టీమ్
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘దేవర’. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తుండగా, సైఫ్‌అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. కాగా 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ఆకట్టుకున్నాయి.

కల్కి-ఇండియన్ బిగ్గెస్ట్ సాంగ్ లోడింగ్
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కల్కి 2898 ఏడీ సినిమాకు మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. జూన్ 27వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

రవితేజ డెడికేషన్‌కి హరీష్ శంకర్ ఫిదా
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ డెడికేషన్‌కి హ్యాట్సాఫ్ అని చెప్పారు టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్. ఆయన దర్శకత్వంలో రవితేజ హీరోగా 'మిస్టర్ బచ్చన్' అనే చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్ సమయంలో రవితేజ తీవ్రమైన మెడ నొప్పితో బాధపడ్డారు. అయినాసరే షూటింగ్ నిలిపివేయకుండా అలానే కంటిన్యూ చేశారు. దీంతో షెడ్యూల్ మేరకు సన్నివేశాల చిత్రీకరణ సాఫీగా జరిగింది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు హరీష్ శంకర్ రవితేజ డెడికేషన్‌కి ఫిదా అయ్యారు.

పవన్ కు డిప్యూటీ సీఎం, పలు శాఖల కేటాయింపు
ఏపీలో ప్రభుత్వం మారిన సంగతి తెలిసిందే కదా. 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా చేసేశారు. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ తో సహా మిగిలిన వారు మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రులకు ఏ శాఖలు వస్తాయా అని చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏ శాఖ తీసుకుంటారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు దానిపై కూడా క్లారిటీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పలు శాఖలు దక్కాయి.

విశ్వంభర లోకి మరో టాలెంటెడ్ నటుడు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి విశిష్ట దర్శకత్వంలో రాబోతున్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. జులై నాటికి ఈసినిమా షూటింగ్ పూర్తి చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే గ్రాఫిక్స్ కు టీమ్ ఎక్కువ సమయం కేటాయించనున్నారట. ఇప్పటికే ఈసినిమా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి.

రివ్యూ : మహారాజ
ఓవరాల్ గా విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో వచ్చిన ఈ మహారాజా లో అన్ని హైలైట్ అయ్యాయి.పక్కా పైసా వసూల్ సినిమా. థియేటర్లలో చూస్తే థ్రిల్ చేయడం గ్యారెంటీ. క్రైమ్ థ్రిల్లర్ లను ఇష్టపడే వారు మాత్రమే కాదు మిగితా వారు కూడా థియేటర్లకు వెళ్లి చూసే సినిమా మహారాజ అని చెప్పొచ్చు.

కన్నప్ప టీజర్ రిలీజ్- విజువల్ ట్రీట్
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. ఇక ఎప్పటినుండో ఊరిస్తున్న ఈ సినిమా టీజర్ అయితే వచ్చేసింది. టీజర్ మాత్రం చాలా బాగుంది. కాలాముఖ వాయులింగాన్ని పెకలించి తీసుకురావడానికి పంపిన 50మందిని నీ తమ్ముడు టెంగనతో సహా అందరినీ చంపేశాడు అంటూ మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. మంచు విష్ణు తిన్నడు పాత్రలో నటిస్తున్నాడు. ఇక విజువల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. న్యూజిలాండ్ లోనే ఈసినిమా సింహ భాగాన్ని తీయాలని మేకర్స్ ఎందుకు అనుకున్నారో ఇప్పుడు అర్థమవుతుంది. పచ్చని అందాలతో చాలా ఫ్రెష్ గా ఉన్నాయి విజువల్స్. యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగున్నాయి. ప్రభాస్ కళ్ల…

అక్షయ్ కుమార్ 'సర్ఫిరా' రిలీజ్ డేట్ ఫిక్స్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సర్ఫిరా'. జాతీయ అవార్డు గ్రహీత సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే శాలినీ ఉషాదేవి, పూజా తోలానితో కలిసి సుధా కొంగర స్క్రిప్ట్‌ను అందించారు. కాగా ఈ చిత్రం సూర్య హీరోగా 2020లో వచ్చిన బ్లాక్ బస్టర్ 'సూరారై పోట్రు'కి రీమేక్ కావడం విశేషం. డైరెక్ట్‌గా ఓటీటీలోకి విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. తెలుగులో ఇది 'ఆకాశమే హద్దురా' పేరుతో విడుదలైంది. మరో విశేషమేంటంటే.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇందులో ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఆయనతో పాటుగా ఈ చిత్రంలో రాధిక మదన్, పరేష్ రావల్, సీమా బిస్వాస్ కీలక పాత్రలు…

సుధీర్ బాబు హరోం హర రివ్యూ - యాక్షన్ ప్యాక్డ్ ఫిలిం
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా మాస్ ఆడియన్స్ కు, యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి నచ్చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాలో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ లు, వైలెన్స్ మాత్రం యాక్షన్ లవర్స్ కి ఐ ఫీస్ట్ ను అందిస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఓ మంచి ఫీలింగ్ తో బయటకు రావచ్చు.

శ్రీవిష్ణు క్యారక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేసిన స్వాగ్ టీమ్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరోలలో శ్రీవిష్ణు ఒకడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లే ఆయన కథల పరంగా కూడా విభిన్న చిత్రాలు చేయడంలో ముందుంటాడు. 'సామజవరగమన'తో గతేడాది సూపర్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు.. ఇటీవలే 'ఓం భీమ్ బుష్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మంచి జోష్ మీదున్న శ్రీ విష్ణు ఇదే ఊపులో మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు.

స్ట్రీమింగ్ కు వచ్చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో వచ్చిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. గోదావరి నేపథ్యంలో రూరల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కింది. ఈసినిమా మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఫస్ట్ షో నుండే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో విశ్వక్ మరోసారి తన మాస్ నటనతో ఆకట్టుకున్నాడు. తన పాత్ర ఈసినిమా విజయానికి ప్రధానంగా నిలిచింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

నితిన్ రాబిన్‌హుడ్‌లో హీరోయిన్‌గా స్టార్ యాక్ట్రెస్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. గత కొన్ని రోజుల క్రితం 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు ఏక కాలంలో రెండు చిత్రాలను పట్టాలెక్కిస్తున్నాడు. వీటిలో ఒకటి శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'తమ్ముడు' కాగా, మరొకటి వెంకీ కుడుముల డైరెక్షన్‌లో రూపొందుతోన్న 'రాబిన్ హుడ్'. కాగా ఈ రెండు సినిమాలపై మంచి బజ్ ఉంది. ఇక నితిన్, వెంకీ కుడుముల ఇద్దరూ కలిసి ఇంతకుముందు 'భీష్మ' అనే సినిమా చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.