ఆశిష్ రెడ్డి హీరోగా బేబి సినిమాతో క్రేజ్ ను సొంతం చేసుకున్న వైష్ణవి చైతన్య హీరోయిన్ గా వచ్చిన సినిమా లవ్ మీ. లవ్ ప్లస్ హారర్ర నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలో కూడా సందడి చేయడానికి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వారు ఈసినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా స్ట్రీమింగ్ డేట్ ను ఇప్పటికే ప్రకటించారు. దీనిలో భాగంగానే ఈసినిమా నేటి నుండి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. సినిమా రిలీజ్ అయిన మూడు వారాలకి ఈసినిమా స్ట్రీమింగ్ కు వచ్చేయడం విశేషం. ప్రస్తుతానికి తెలుగులో ఈసినిమా అందుబాటులోకి వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా అరుణ్ భీమవరపు దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తోనే వచ్చింది. హీరో దెయ్యాన్ని లవ్ చేస్తే అన్న కాన్సెప్ట్ తో ఈసినిమా తెరకెక్కింది. ఈసినిమాలో ఇంకా సిమ్రాన్ చౌదరి, రవి కృష్ణ, రాజీవ్ కనకాల, తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఈసినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందించగా లెజెండరీ కెమెరామెన్ పీసీ శ్రీరాం సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































