రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 AD’. క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ నటులు నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో దీపికా పదుకొణే ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. మరొక హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలక పాత్రలో కనిపించనుంది. వైజయంతి మూవీస్ పతాకంపై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీ దత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ‘కల్కి 2898 AD’ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలను ముమ్మురం చేసింది. దీనిలో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్, స్పెషల్ వీడియోస్ అన్నీ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. అయితే ఈ సినిమాలో బుజ్జి అనే కారు చాలా కీలక పాత్ర పోషించనుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే తెలియజేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆ కారును ఎఫ్ 1 రేసింగ్‌లో పాల్గొనే కార్ల వంటి మోడల్లో డిజైన్ చేయించడం విశేషం.
మహీంద్రా కంపెనీ సహాయంతో ఈ బుజ్జిని రూపొందించినట్లు తెలిపారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా బుజ్జిని కలుసుకున్నారు. తాజాగా ఆయన దీనిపై స్పషల్ డ్రైవ్ చేశారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ ఎక్స్‌లో షేర్ చేయగా బాగా వైరల్ అవుతోంది. ఇక ఇటీవలే హీరో అక్కినేని నాగచైతన్య కూడా బుజ్జిపై స్పెషల్ రైడ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. భారతీయ తెరపై ఇప్పటివరకూ రానటువంటి కథతో రూపొందుతుండటంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























