అడివి శేష్ ‘డకాయిట్’ షూటింగ్‌లో జాయిన్ అయిన శృతి హాసన్

Shruti Haasan Joins The Sets of Adivi Sesh’s Pan Indian Film Dacoit

‘మేజర్’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందాడు టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్. ప్రస్తుతం ఆయన ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డకాయిట్’. అడివి శేష్ గతంలో నటించిన ‘క్షణం’, ‘గూఢచారి’తో సహా పలు తెలుగు బ్లాక్‌బస్టర్‌లకు డివోపీగా పనిచేసిన షానీల్ డియో ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి అడివి శేష్, షానీల్ డియో కథ స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఈ మూవీలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా శేష్, శ్రుతి జంటగా నటిస్తున్న తొలి చిత్రం ఇదే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. దీనిలో భాగంగా ఒక ఇంపార్ట్టెంట్, మ్యాసీవ్ యాక్షన్ షెడ్యూల్‌లో మేకర్స్ లీడ్ కాస్ట్ పై కీలకమైన సన్నివేశాలు, యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్‌గా నటిస్తున్న శ్రుతిహాసన్ ఈ షెడ్యూల్‌లో టీమ్‌తో జాయిన్ అయింది. ఈ సందర్భంగా శృతి హాసన్, శేష్‌తో సెల్ఫీని షేర్ చేశారు. కాగా డకాయిట్.. ఇద్దరు మాజీ ప్రేమికుల కథ. తమ జీవితాలలో వేగంగా ఎదిగేందుకు వారు వరుస దోపిడీలు చేస్తుంటారు. దేనికోసం వారు మళ్ళీ కలుసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ జర్నీలో వారు ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారు? అనేది సినిమా కథ.

పాన్-ఇండియా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా.. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రజెంట్ చేస్తోంది. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం 2022లో వచ్చి విమర్శకుల ప్రశంసలు పొందిన ‘మేజర్’ తర్వాత శేష్ యొక్క సెకెండ్ స్ట్రయిట్ హిందీ మూవీ కావడం విశేషం. కాగా సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలోనే తెలియజేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.