హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా స్వాగ్ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో రాజరాజచోర సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి హిట్ నే అందించింది. దీంతో ఈసినిమా పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈసినిమా నుండి రోజుకో అప్ డేట్ ఇస్తూ సినిమాపై క్రేజ్ ను పెంచేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి రేజర్ అన్న పేరుతో స్పెషల్ వీడియోను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు చిత్రబృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. మీరా జాస్మిన్, దక్షా నగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. వేద రామన్ శంకరన్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. జూలై ఫస్ట్ వీక్ లో ఈసినిమాను రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























