జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే కదా. విజయవాడ దగ్గరలోని కేసరపల్లి ఐటీ పార్క్ లో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈకార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయగా ఆతరువాత మంత్రులు ఒక్కొక్కరిగా ప్రమాణం చేశారు. ఈనేపథ్యంలోనే గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలో పవన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయరు. ఇక మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడంతో రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు జనసేనానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలోనే పవన్ కు ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ కూడా పవన్ శుభాకాంక్షలు తెలియచేశారు. తాజాగా ఈసినిమా నుంచి పవన్ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్లో సనాతన ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ రాసుకోచ్చారు. ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై మొదటి నుండీ మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈసినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























