ఒకే వేదికపై రజినీకాంత్‌, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్

Rajinikanth, Chiranjeevi, Balakrishna Shines at Pawan Kalyan Oath Taking Ceremony

ఇండియాలో సినిమా హీరోలు అంటే ఓ రేంజ్‌లో క్రేజ్ ఉంటుంది. అదే దక్షిణాదిలో అయితే ఇక చెప్పనే అక్కరలేదు. స్టార్‌డమ్ ఉన్న ప్రతి నటుడికి లక్షల్లో అభిమానులు ఉంటారు. ఇక ఎప్పుడైనా ఏదయినా సందర్భంలో ఇద్దరు అగ్ర హీరోలు ఒకేచోట కనిపిస్తే వారి అభిమానులకు పండుగే. అలాంటిది ఒకే వేదికపై ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు అగ్ర తారలు కనిపిస్తే ఊహించుకోవడానికే వాహ్ అనిపిస్తుంది కదా.! అదే నిజమైతే ఆయా హీరోల ఫ్యాన్స్ ఆనందానికి హద్దే ఉండదు. ఇలాంటి సందర్భమే తాజాగా ఒకటి చోటుచేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ అద్భుత దృశ్యానికి వేదిక అయింది ఆంధ్రప్రదేశ్. బుధవారం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ సహా మొత్తం 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

ఇంతమంది అతిరథ మహారథులు హాజరైన ఈ వేడుకకు చిత్ర పరిశ్రమ నుంచి కూడా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి సతీమణులతో కలిసి వచ్చారు. ఈ కార్యక్రమంలో వీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీవీఐపీలకు కేటాయించిన స్పెషల్ గ్యాలరీలో ఈ అగ్ర హీరోలు పక్కపక్కనే ఆసీనులయ్యారు. ఇక వీరితో పాటుగా మరో టాలీవుడ్ అగ్ర నటుడు బాలకృష్ణ కూడా హాజరై సందడి చేశారు.

మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏకంగా మంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం ఆయన తన సోదరుడైన చిరంజీవి వద్దకు వచ్చి పాదాభివందనం చేశారు. అలాగే పక్కనే ఉన్న రజినీకాంత్, బాలకృష్ణ ఇరువురికి మర్యాదపూర్వకంగా నమస్కరించారు. ఈ సందర్భంగా నలుగురు అగ్ర హీరోలు ఇలా ఒకే వేదికపై కనిపించడం అభిమానులతో పాటు వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్‌ నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.