మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో వచ్చిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. గోదావరి నేపథ్యంలో రూరల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కింది. ఈసినిమా మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఫస్ట్ షో నుండే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో విశ్వక్ మరోసారి తన మాస్ నటనతో ఆకట్టుకున్నాడు. తన పాత్ర ఈసినిమా విజయానికి ప్రధానంగా నిలిచింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా ఓటీటీ లోకి వచ్చేసి సర్ ప్రైజ్ చేసేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వారు ఈసినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నాారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ వచ్చేసింది. సినిమా రిలీజ్ అయిన రెండు వారాల్లోనే ఈసినిమా ఓటీటీలోకి రావడం విశేషం. తెలుగుతో పాటు ఇతర దక్షిణ భాషలైన తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది.
కాగా ఈసినిమాలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించగా.. సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో కనిపించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. యువన్ శంకర్ రాజా ఈసినిమాకు సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























