రవితేజ డెడికేషన్‌కి హరీష్ శంకర్ ఫిదా

Director Harish Shankar Thanks Ravi Teja as he is Working with Severe Neck Pain

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ డెడికేషన్‌కి హ్యాట్సాఫ్ అని చెప్పారు టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్. ఆయన దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘మిస్టర్ బచ్చన్‌’ అనే చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్ సమయంలో రవితేజ తీవ్రమైన మెడ నొప్పితో బాధపడ్డారు. అయినాసరే షూటింగ్ నిలిపివేయకుండా అలానే కంటిన్యూ చేశారు. దీంతో షెడ్యూల్ మేరకు సన్నివేశాల చిత్రీకరణ సాఫీగా జరిగింది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు హరీష్ శంకర్ రవితేజ డెడికేషన్‌కి ఫిదా అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా.. “మాస్ మహారాజ్ అంకితభావానికి హ్యాట్సాఫ్. విపరీతమైన మెడనొప్పితో కూడా పని చేస్తున్న రవితేజ అన్నయ్యా థ్యాంక్యూ.. మీరు ప్రతిరోజూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు” అని పేర్కొన్నారు. అలాగే దీనికి రవితేజ హాట్ బ్యాగ్ పెట్టుకుని ఉండగా, పక్కనే కూర్చుని పట్టుకుని ఉన్న పిక్ షేర్ చేశారు. కాగా వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం కావడం విశేషం. ఇంతకుముందు వీరి కాంబోలో ‘షాక్’, ‘మిరపకాయ్’ సినిమాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరి నుంచి వస్తోన్న ‘మిస్టర్ బచ్చన్‌’పై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇక ‘నామ్ తో సునా హోగా’ అనేది ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ మూవీలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోండగా.. జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. దర్శకుడు హరీష్ శంకర్, జగపతి బాబు పాత్రని పవర్ ప్యాక్‌డ్‌గా ప్రజెంట్ చేస్తున్నారు. కాగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించనున్నాడు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, కెమెరామెన్ అయనంక బోస్ డీవోపీగా పని చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.