శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా మనమే. లవ్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా శర్వా ఎనర్జిటిక్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ నే రాబట్టుకుంటుంది. ఈసినిమాలో విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమాపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. మనమే సినిమ చూసి చాలా ఎంజాయ్ చేశా.. శర్వానంద్ అవుట్ స్టాండింగ్ పర్ఫెమెన్స్ ఇచ్చాడు.. ఈసినిమా కాస్ట్ కు ఇంకా చిత్రయూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.
ఇంకా శర్వా పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో శర్వా 36సినిమా వస్తుంది. ఈసినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అలానే శర్వా 37 మూవీ సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రానుంది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























