టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ‘నామ్ తో సునా హోగా’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా.. సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. దర్శకుడు హరీష్ శంకర్, జగపతి బాబు పాత్రని పవర్ ప్యాక్డ్గా ప్రజెంట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన టైటిల్ పోస్టర్లో హీరో రవితేజ తన ఫేవరేట్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ పోజ్‌లో కనిపించి అలరించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా మిస్టర్ బచ్చన్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అలాగే జూన్ 17న ఒక షో రీల్ రిలీజ్ కానుంది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకుడు హరీశ్ శంకర్ ఒక ప్రమోషనల్ వీడియో విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఏముందో మనమూ ఓ లుక్కేద్దాం.
“రవితేజ ఫ్యాన్ మిస్టర్ బచ్చన్ సెట్స్‌లోకి వస్తాడు. హరీశ్ శంకర్ దగ్గరకి వెళ్లి తాను రవితేజ డై హార్డ్ ఫ్యాన్ అని పరిచయం చేసుకుంటాడు. ఈ క్రమంలో మూవీ నుంచి ఎదైనా అప్డేట్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయడం చూడొచ్చు. అందుకు హరీశ్ శంకర్ తనదైన శైలిలో బదులిస్తూ.. షూటింగ్ అయిపోయింది. ఇక అప్డేట్లే మిగిలి ఉన్నాయి. గ్లింప్స్, టీజర్, ట్రైలర్లు అందరూ ఇచ్చేవే. అందుకే మనం ఈసారి కొత్తగా ప్లాన్ చేద్దాం. ఒక షో రీల్ వదులుదాం. అందులో డైలాగ్స్ ఉండవు” అని అనడం వీడియోలో కనిపిస్తుంది.
వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, కెమెరామెన్ అయనంక బోస్ డీవోపీగా పని చేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా.. ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























