రివ్యూ : మహారాజ

maharaja movie telugu review

నటీనటులు : విజయ్ సేతుపతి,అనురాగ్ కశ్యప్,మమతా మోహన్ దాస్ 
ఎడిటింగ్ : పిల్లోమిన్ రాజ్ 
సినిమాటోగ్రఫీ : దినేష్ పురుషోత్తమన్ 
సంగీతం : అజనీష్ లోకనాథ్ 
దర్శకత్వం : నిథిలన్ స్వామినాథన్ 
నిర్మాతలు : సుదర్శన్ సుందరమ్, జగదీష్ పళనిస్వామి

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరోగానే కాకుండా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా ఏ పాత్రలోనైనా సహజంగా నటించి స్టార్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు తమిళ నటుడు విజయ్ సేతుపతి.  కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులోనూ ఈయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో నటించిన 50 వ సినిమా మహారాజ.ఈసినిమా తమిళం తోపాటు తెలుగులో ఈరోజు విడుదలైయింది.కంటెంట్ మీద వున్న నమ్మకంతో విజయ్ సేతుపతి, సినిమాను ఇక్కడ  కూడా బాగానే  ప్రమోట్ చేశాడు.మరి మహారాజ ఎలావుంది ? అంచనాలను అందుకుందా లేదో చూద్దాం.

కథ :  

బార్బర్ అయిన మహారాజా (విజయ్ సేతుపతి) కి తన కూతురు అంటే ప్రాణం.భార్య చనిపోతుంది.పెద్దగా ఎవరితో ఎక్కువగా మాట్లాడాడు.అయితే ఒకానొక రోజు తన ఇంట్లోకి దొంగలు చొరబడి మహారాజా మీద దాడి చేసి లక్ష్మిని ఎత్తుకెళ్తారు.దాంతో మహారాజా,లక్ష్మిని ఎవరో ఎత్తుకెళ్లారని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు.అయితే పోలీసులు ఆ కంప్లైంట్ తీసుకోవడానికి నిరాకరిస్తారు.ఇంతకీ దొంగలు లక్ష్మిని ఎందుకు ఎత్తుకెళ్తారు? మహారాజా మీద ఎందుకు దాడి చేస్తారు? అసలు లక్ష్మి ఎవరు? చివరికి ఏమైంది అనేది మిగితా కథ. 

విశ్లేషణ : 

కొన్ని సినిమాల్లో కథను రివీల్ చేస్తే ప్రేక్షకుడు థ్రిల్ మిస్ అవుతాడు.దృశ్యం లాంటి సినిమాలు అందుకు ఉదాహరణ గా చెప్పుకోవచ్చు.అలాంటి తరహా సినిమానే ఈ మహారాజా.ముందుగా బలమైన కంటెంట్ తో గ్రిప్పింగ్ గా సినిమాను తెరకెక్కించిన దర్శకుడుని అభినందించాల్సిందే. ఇందులో స్క్రీన్ ప్లే గూస్ బాంబ్స్ తెప్పిస్తే ట్విస్టులు థ్రిల్ చేస్తాయి.తన అద్భుతుమైన రైటింగ్ తో ఓ ఫర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ ను ఇచ్చాడు దర్శకుడు. చాలా రోజుల తరువాత వచ్చిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ గా మహారాజా ను చెప్పుకోవచ్చు.

కథలోకి  తీసుకువెళ్లేందుకు  కొంచెం టైం తీసుకున్నాడు డైరెక్టర్. అయితే పాత్రల పరిచయం చేయడంలో కూడా ఎక్కడ బోర్ కొట్టించలేదు.సినిమా సీరియస్ మోడ్ లో సాగుతున్న మధ్యలో కామెడీ తో నవ్వించాడు.ట్విస్టులు రివీల్ చేయడం కానీ స్క్రీన్ ప్లే విషయం లో దర్శకుడిని పనితనం మెచ్చుకోవాల్సిందే. విజయ్ సేతుపతి ఎంట్రీ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. పోలీస్ స్టేషన్ లో వచ్చే సన్నివేశాలు, లక్ష్మి ఎవరు అనే ట్విస్టు మెప్పిస్తాయి. సినిమాలో రెండు కథలను సమాంతరంగా నడిపి వాటిని లింక్ చేసిన తీరు బాగుంది. సెల్వ పాత్ర భయపెడుతుంది. ఈ పాత్రను బాగా డిజైన్ చేశారు. సినిమా ఎమోషనల్ గా స్టార్ట్ అయ్యి ఎమోషనల్ గానే ముగుస్తుంది. క్లైమాక్స్ ను చాలా బాగా డీల్ చేశాడు దర్శకుడు. అక్కడక్కడా కొంచెం స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది.

నటీనటుల విషయానికి వస్తే విజయ్ సేతుపతి సినిమాకు పెద్ద అసెట్.తన నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కేవలం కళ్ళతో పలికించిన ఎక్స్ ప్రెషన్స్ నటుడిగా తన స్థాయిని తెలియజేస్తాయి.ఇది తనకు 50వ సినిమా.ఈసినిమా తన కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది.ఇక సెల్వ  పాత్రలో నటించిన అనురాగ్ కశ్యప్ అదరగొట్టాడు. తన నుండి ఏం కావాలో అది ఇచ్చాడు.మహారాజా కూతురు పాత్రలో నటించిన సచిన నటన మెప్పిస్తుంది. మిగితా పాత్రల్లో నటించిన మమతా మోహన్ దాస్, భారతీరాజా, మణికందన్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికంగా సినిమా ఉన్నతంగా వుంది. డబ్బింగ్ సినిమా చూస్తున్నాం అన్న భావన కలుగదు.ఎడిటింగ్ సూపర్.క్రిస్ప్ రన్ టైం సినిమాకు హెల్ప్ అయ్యింది.సినిమాటోగ్రఫీ బాగుంది. ఈసినిమాకు సాంగ్స్ అవసరం లేదు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీ రోల్ ప్లే చేసింది.యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది.నిర్మాణ విలువలు కథకు తగ్గట్లు వున్నాయి.

ఓవరాల్ గా విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో వచ్చిన ఈ మహారాజా లో అన్ని హైలైట్ అయ్యాయి.పక్కా పైసా వసూల్ సినిమా. థియేటర్లలో చూస్తే థ్రిల్ చేయడం గ్యారెంటీ. క్రైమ్ థ్రిల్లర్ లను ఇష్టపడే వారు మాత్రమే కాదు మిగితా వారు కూడా థియేటర్లకు వెళ్లి చూసే సినిమా మహారాజ అని చెప్పొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.