కన్నప్ప నా బిడ్డలాంటిది – విష్ణు మంచు

Vishnu Manchu Says, Kannappa Movie is Like My Child

టాలీవుడ్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన తాజా చిత్రం ‘కన్నప్ప’. భక్తిరస ప్రధానంగా రూపొందిన ఈ సినిమాకి బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద విష్ణు తండ్రి, సీనియర్ నటుడు డా.మోహన్ బాబు నిర్మించారు. ఇక ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు భాగమయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, ప్రీతి ముకుందన్, కాజల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంయుక్తంగా సంగీతం అందించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు కన్నప్ప చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు టీజర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.

ఈ సందర్భంగా విష్ణు మంచు మాట్లాడుతూ.. “కన్నప్పను ప్రతీ ఒక్క ఆడియెన్ భుజానికి ఎత్తుకుని ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అభిమానుల నుంచి వస్తున్న సపోర్ట్‌ని చూస్తూనే ఉన్నాను. అందుకే వాళ్లలోంచి కొంత మందిని ఇక్కడకు పిలిచాను. 2014లో కన్నప్ప జర్నీ ప్రారంభమైంది. 2015లో నేను కన్నప్పని డెవలప్ చేస్తూ వెళ్తుంటే.. తణికెళ్ల భరణి గారు పూర్తిగా నాకే అప్పగించారు. నా దైవం, నా తండ్రి మోహన్ బాబు గారు, విన్ని, వినయ్ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే కన్నప్పను తెరపైకి తీసుకు రాగలిగాను” అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “మొదట కన్నప్ప టీం సెట్ కాలేదు కానీ.. చిత్రీకరణ కోసం లొకేషన్ల కోసం వేట ప్రారంభించాను. శివుడు పర్మిషన్ ఇస్తే తీయడానికి రెడీగా ఉండాలనే అంతా సెట్ చేసి పెట్టుకున్నాను. గత ఏడాది ఆ శివుడు పర్మిషన్ ఇచ్చారు. మేం సినిమాను తీశాం. ఆయన ఆశీస్సుల వల్లే సినిమాను తీయగలిగాం. కన్నప్ప నా బిడ్డలాంటిది. నేను ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇకపై ప్రతీ సోమవారం కన్నప్ప నుంచి అప్డేట్ వస్తూనే ఉంటుంది” అని తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.