హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి సినిమాను ప్రకటించినప్పటి నుండే అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం అయితే షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను అలానే పలు పోస్టర్లు రిలీజ్ చేయగా అవి సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ప్రస్తుతం అయితే షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొంత మేరుక షూటింగ్ పూర్తి చేసుకున్నారు కూడా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ ఫొటో షేర్ చేశాడు హరీష్ శంకర్. శ్రీలీల పుట్టిన రోజు సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఓ వర్కింగ్ స్టిల్ ని షేర్ చేసి శ్రీలీలకు శుభాకాంక్షలు తెలిపి, త్వరలోనే మళ్ళీ షూట్ మొదలుపెడదాం అని తెలిపారు. ఈఫొటోలో హరీష్ శంకర్, శ్రీలీల ఉయ్యాల మీద కూర్చొని ఉండగా.. హరీష్ శ్రీలీలకు సీన్ చెప్తుంటాడు.. వెనకాలే పవన్ కళ్యాణ్ కూడా నిల్చొని ఉన్నాడు. దీంతో ఈఫొటో ఇప్పుడు వైరల్ గా అవుతుంది.
https://twitter.com/harish2you/status/1801610800244896089
కాగా ఈసినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























