టాలీవుడ్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన తాజా చిత్రం ‘కన్నప్ప’. భక్తిరస ప్రధానంగా రూపొందిన ఈ సినిమాకి బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద విష్ణు తండ్రి, సీనియర్ నటుడు డా.మోహన్ బాబు నిర్మించారు. ఇక ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు భాగమయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, ప్రీతి ముకుందన్, కాజల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంయుక్తంగా సంగీతం అందించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు కన్నప్ప చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు టీజర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నటుడు, నిర్మాత డా.మోహన్ బాబు మాట్లాడుతూ.. “కన్నప్ప ఏ తరానికి అయినా కొత్తగానే ఉంటుంది. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్యం ఏంటి? అన్నది ఈ చిత్రంలో చూపించాం. ఎంతో వ్యయప్రయాసతో నిర్మించాం. భారత దేశంలోని నాలుగు మూలల ఉన్న మహా నటుల్ని ఈ చిత్రంలో తీసుకున్నాం. శరత్ కుమార్ తీసిన పెదరాయుడు సినిమాను నేను తీశాను. ఎలాంటి పాత్రనైనా అవలీలగా శరత్ కుమార్ పోషించగలరు” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలుంటాయి. పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే ఈ సినిమా తీశాం. ముందుగా కన్నప్ప కోసం కృష్ణంరాజు గారితో మాట్లాడాం. విష్ణు కోసం కన్నప్ప తీయాలని అనుకుంటున్నానని చెబితే.. ప్రభాస్ కోసం రాసుకున్న కథను కూడా కృష్ణంరాజు గారు ఇచ్చేశారు. మేం మున్ముందు ఇంకా ఎన్నో ఈవెంట్లు నిర్వహిస్తాం. నిర్మాతగా నాకు మాత్రమే కాకుండా.. కన్నప్ప టీంకు ప్రజలందరి ఆశీస్సులు కావాలి’ అని కోరారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























