సుధీర్ బాబు హరోం హర రివ్యూ – యాక్షన్ ప్యాక్డ్ ఫిలిం

sudheer babu harom hara movie telugu review

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుధీర్ బాబు హీరోగా జ్ఞాన సాగర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హరోంహర. కుప్పం నేపథ్యంలో డివైన్ టచ్ తో ఈసినిమాను రూపొందించారు. ఇక ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉంది..? ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది అన్న విషయాలు తెలియాలంటే మాత్రం రివ్యూలోకి వెళ్లాల్సిందే.

నటీనటులు.. సుధీర్ బాబు, మాళవిక శర్మ, సునీల్, రవి కాలే, రాజశేఖర్ అనింగి, కేషల్ దీపక్ తదితరులు
దర్శకత్వం.. జ్ఞాన సాగర్
బ్యానర్స్.. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌
నిర్మాతలు..సుమంత్‌ జీ నాయుడు
సంగీతం..చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫి..అరవింద్ విశ్వనాథన్

కథ
కుప్పం గ్రామంలో తిమ్మారెడ్డి, అతని సోదరుడు బసవ (రవి కాలె), కొడుకు శరత్ రెడ్డి (అర్జున్ గౌడ) అరాచకమైన పనులు చేస్తుంటూ పెత్తనం సాగిస్తుంటారు. అలాంటి సమయంలోనే ఆ ఊరిలోకి ఎంట్రీ ఇస్తాడు సుబ్రహ్మణ్యం (సుదీర్ బాబు). అక్కడ పాలిటెక్నిక్ కాలేజీలో ఉద్యోగంలో చేరతాడు. ఈక్రమంలో ఒక రోజు శరత్ రెడ్డి మనుషులతో గొడవపడటంతో సుబ్రహ్మణ్యం ఉద్యోగం పోతుంది. మరోవైపు తమ ఫ్రెండ్ కానిస్టేబుల్ పళనిస్వామి (సునీల్) సస్పెండ్ అవుతాడు. ఈక్రమంలో సస్పెండ్ అయిన పళని స్వామి తో కలిసి అక్రమంగా తుపాకీలు తయారు చేసి అమ్మడం మొదలు పెడతాడు. అలా తను గొడవపడిన శరత్ రెడ్డితో కూడా స్నేహం ఏర్పడుతుంది. ఇలా జరుగుతుండగా.. సుబ్రహ్మణ్యం తండ్రిని చంపాలనుకున్న శరత్ రెడ్డిని కొడతాడు. మరి సుబ్రమణ్యం తండ్రిని శరత్ రెడ్డి ఎందుకు చంపాలని అనుకున్నాడు? తమ్మి రెడ్డికి ఎదురు తిరిగిన సుబ్రమణ్యం ఆ తర్వాత కుప్పం ప్రజల కోసం ఏం చేశాడు? తన కొడుకు మృతికి కారణమైన సుబ్రమణ్యం మీద పగ తీర్చుకోవాలని తమ్మి రెడ్డి ఏం చేశాడు? ఆ తర్వాత ఏమైంది? అనేది ఈసినిమా మిగిలిన కథ..

విశ్లేషణ
ఊరిలో పెత్తందారులు, వారు చేసే అరాచకాలను బరిస్తూ జీవనం సాగించే ప్రజలు, అలాంటి సమయంలో ఊరిలోకి వస్తాడు హీరో.. ఆ దుర్మార్గుల బారి నుండి ప్రజలను కాపాడి వారికి హీరో అవుతాడు.. మరి ఇలాంటి పాయింట్ తో ఎన్ని సినిమాలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాత తరం నుండి ఇప్పటివరకూ కొన్ని వందల సినిమాలు వచ్చి ఉంటాయి. ఇప్పుడు ఈసినిమా కూడా అదే పాయింట్ తో వచ్చింది. మరి ఏ సినిమాను తీసుకున్నా ఇంతకుముందు వచ్చినట్టే అనిపిస్తుంది. కానీ సినిమా విజయం మాత్రం ఎగ్జిక్యూషన్ మీద, ఎంత కొత్తగా చూపిస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

ఇక హరోం హర సినిమా విషయానికి వస్తే పాయింట్ పాతదే అయినా దానిని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. తన చెప్పాలన్న పాయింట్ చాలా సూటిగా, స్పష్టంగా చెప్పేశాడు. ఫస్ట్ హాఫ్ లో కథలోకి వెళ్లడానికి టైమ్ పట్టినా ఇంటర్వెల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఒక్కసారిగా ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేశాడు. సెకండాఫ్ లో కథలో వేగం పుంజుకుంటుంది. అక్కడక్కడ ఎమోషనల్ కంటెంట్ ను పెట్టినా అది పెద్దగా కనెక్ట్ అవ్వదు. క్లైమాక్స్ ఊహించదగినదే అయినా మేకింగ్ మాత్రం బాగుంది.

పెర్ఫామెన్స్
ఈసినిమాకు ప్రధాన బలం సుధీర్ బాబు. ఈసినిమా కోసం తన మేకోవర్ ను చాలానే మార్చుకున్నాడు. తనపెర్ఫార్మెన్స్ తో, హీరోయిజం ఎలివేట్ సీన్స్ లో కానీ డైలాగ్ డెలివరీ కానీ అదరగొట్టేశాడు. మాళవిక శర్మ తన పాత్ర పరిధి మేరకు నటించింది. ఈ సినిమాకు మరో ప్లస్ అయిన నటుడు సునీల్. సునీల్ కూడా రాయలసీమ యాసలో మాట్లాడతూ మెప్పించాడు. మరోసారి సునీల్ కు ఈసినిమా ద్వారా ఫుల్ లెంగ్త్ రోల్ అయితే దక్కింది. లక్కీ లక్ష్మణ్, రవి కాలే, అర్జున్ గౌడ తమ పాత్రల మేర బాగానే నటించారు.

టెక్నికల్ వాల్యూస్
ఈసినిమా విజయంలో కీలక పాత్ర ఎవరికైనా దక్కుతుంది అంటే అది టెక్నికల్ టీమ్ కు అని చెప్పొచ్చు. ప్రొడక్షన్ డిజైనర్ మనీషా ఎ దత్, సినిమాటోగ్రాఫర్ అరవింద్ విశ్వనాథన్, సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ ఈ ముగ్గురికీ క్రెడిట్ ఇవ్వాల్సిందే. అరవింద్ విశ్వనాథన్ అందించిన సినిమాటోగ్రఫి అయితే సూపర్. విజువల్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. చైతన్ భరద్వాజ్ పాటలు, నేపథ్య సంగీతం అదిరిపోయాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే కొన్ని సీన్లను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లింది. నిర్మాణ విలువలు అయితే టాప్ నాచ్. ప్రతి ఫ్రేమ్ లో ఆ రిచ్ నెస్ అనేది కనిపిస్తుంది.

ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా మాస్ ఆడియన్స్ కు, యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి నచ్చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాలో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ లు, వైలెన్స్ మాత్రం యాక్షన్ లవర్స్ కి ఐ ఫీస్ట్ ను అందిస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఓ మంచి ఫీలింగ్ తో బయటకు రావచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.