టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్’. వీరి కలయికలో 2019లో వచ్చి సూపర్ హిట్టైన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రను పోషిస్తుండగా.. మరి కొందరు ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో.. ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. భారీ అంచనాలున్న ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు శనివారం హీరో రామ్ పోతినేని స్వయంగా సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా హీరో రామ్ పోతినేని న్యూ లుక్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కాగా ఇదే తేదీన అల్లు అర్జున్ ‘పుష్ప’ విడుదవ్వాల్సి ఉండగా.. అది వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో ఇండిపెండెన్స్ డే వేడుకల సమయాన్ని ఉపయోగించుకుంటోంది డబుల్ ఇస్మార్ట్ టీమ్.
కాగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో హై బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ క్రేజీ ఎంటర్టైనర్ కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని జియానెల్లి పనిచేస్తుండటం గమనార్హం. అలాగే స్టంట్ డైరెక్టర్ కేచ నేతృత్వంలో హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్ కంపోజ్ చేస్తున్నారు. ‘పోకిరి’, ‘చిరుత’, ‘ఇస్మార్ట్ శంకర్’ సహా పలు చిత్రాలలో పూరీ జగన్నాధ్‌కు సెన్సేషనల్ మ్యూజిక్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ ‘డబుల్ ఇస్మార్ట్’కు సంగీతం అందిస్తున్నారు. కాగా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























