
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 139


హిందీలో మోత మోగిస్తున్న కల్కి

మరో రికార్డ్ సృష్టించిన కల్కి

గేమ్ ఛేంజర్.. రామ్ చరణ్ షూటింగ్ కంప్లీట్

డబుల్ ఇస్మార్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్

రష్మిక ఫస్ట్ లుక్ గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్

కల్కి 2898 AD పై దేవి శ్రీ ప్రసాద్ రివ్యూ

కల్కి-800 కోట్ల క్లబ్ తో బ్రేక్ ఈవెన్

భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

డార్లింగ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

వెంకీ 76 గురించి క్లారిటి ఇచ్చిన డైరెక్టర్

అలియా భట్ హీరోయిన్‌గా స్పై మూవీ

కుమార్తెకు నామకరణం చేసిన మంచు మనోజ్ దంపతులు
టాలీవుడ్ స్టార్ హీరో మంచు మనోజ్ అభిమానులకు ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. ఏప్రిల్ 13న ఆయన సతీమణి భూమా మౌనికా రెడ్డి పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా హీరో మనోజ్ తమ ముద్దుల తనయను ప్రపంచానికి పరిచయం చేశాడు. సోమవారం పాపకు నామకరణ మహోత్సవం నిర్వహించారు. వైభవంగా జరిగిన ఈ వేడుకకు మంచు ఫ్యామిలీతో పాటు మౌనిక కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

హిందీలో మోత మోగిస్తున్న కల్కి
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898 AD’. ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి టాలీవుడ్ విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా.. జూన్ 27న దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగ్గట్లే బెనిఫిట్ షో నుంచే మ్యాసీవ్ రెస్పాన్స్ అందుకుంది.

మరో రికార్డ్ సృష్టించిన కల్కి
టాలీవుడ్ విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 AD’. ఈ విజువల్ వండర్‌లో పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా.. బాలీవుడ్ భామలు దీపికా పదుకొణె, దిశా పటాని ఫిమేల్ లీడ్ రోల్స్ పోషించారు. అలాగే ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించారు.

కల్కి పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నా - మృణాల్ ఠాకూర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ భామ దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటించగా.. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ విలన్‌గా నటించాడు.

సరిపోదా శనివారం నుండి ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ రిలీజ్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. నాని 31వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి 'బ్రోచేవారెవరురా', 'మెంటల్ మదిలో' ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‍గా నటిస్తుండగా.. ప్రముఖ కోలీవుడ్ దర్శక,నటుడు ఎస్‍జే సూర్య, సాయికుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

గేమ్ ఛేంజర్.. రామ్ చరణ్ షూటింగ్ కంప్లీట్
'ఆర్ఆర్ఆర్' చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ 15వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ఆయన సరసన కియారా హీరోయిన్‌గా నటిస్తోంది.

డబుల్ ఇస్మార్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రష్మిక ఫస్ట్ లుక్ గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్
కుబేర నుండి నిన్న రష్మిక ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను విడుదలచేశారు. ఈ గ్లింప్స్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. రష్మీక ఒక సూట్ కేస్ తో కనిపించడం అందులో డబ్బు ఉండడం దాన్ని కప్పి పెట్టడానికి ఓ గొయ్యి తవ్వడం ఇవ్వని ఆ గ్లింప్స్ లో కనిపించాయి.ఇవన్నీ ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ఇప్పటివరకు 7 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ ను రాబట్టుకొంది.హీరోయిన్ ఫస్ట్ లుక్ కు ఈ రేంజ్ లో వ్యూస్ రావడం గొప్ప విషయమే. ఇంతకుముందు నాగార్జున ఫస్ట్ లుక్ ను కూడా గ్లింప్స్ రూపంలో విడుదలచేశాడు. ఒక్క ధనుష్ లుక్ ను మాత్రమే పోస్టర్ ద్వారా రివీల్ చేశాడు. మొత్తానికి ఈసారి శేఖర్ కమ్ముల గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు.

కల్కి 2898 AD పై దేవి శ్రీ ప్రసాద్ రివ్యూ
టాలీవుడ్ విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 AD’. ఈ విజువల్ వండర్ లో పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె లీడ్ రోల్స్ లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

రాజమౌళిపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తెలుగు ప్రేక్షకులందరూ ముద్దుగా 'జక్కన్న' అని పిలుచుకునే టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి అంటే ఇండియాలో తెలియనివారుండరు. 'ఆర్ఆర్ఆర్' చిత్రం తరువాత అయితే ఆయన ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఈ సినిమా ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై సత్తా చాటడంతో రాజమౌళి పేరు అనేక దేశాల్లో మారుమ్రోగిపోయింది. వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ చాలామంది ఆయనకు అభిమానులయ్యారు.

కల్కి-800 కోట్ల క్లబ్ తో బ్రేక్ ఈవెన్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కల్కి 2898ఏడీ. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అంచనాలను నిజం చేస్తూ ఈసినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పురాణాలను భవిష్యత్‌ను కలుపుతూ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నటీనటుల నటన, వావ్ అనిపించేలా విజువల్స్, వీఎఫ్‌ఎక్స్ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.

రాయన్- థర్డ్ సింగిల్ రాయన్ రంబుల్ రిలీజ్
ఈ ఏడాది ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు విలక్షణ నటుడు ధనుష్. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో రాయన్ సినిమా కూడా ఒకటి. ఈసినిమాకు స్వయంగా ధనుషే దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. మరోవైపు అప్ డేట్లు కూడా ఇస్తూ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు.

భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం 'భారతీయుడు 2'. 1996లో వీరి కాంబో లోనే వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్గా రూపొందిన ఈ మూవీలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

డార్లింగ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా విశ్వక్ సేన్
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి క్యామియో రోల్స్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరో స్థాయికి అడిగాడు. ప్రముఖ తెలంగాణ చేనేత కళాకారుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మల్లేశం' సినిమాతో తనలో అద్భుతమైన నటుడు ఉన్నాడని నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో ప్రియదర్శి ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'డార్లింగ్'. 'వై దిస్ కొలవరి?' అనేది టాగ్ లైన్‌గా ఉంది.

డార్లింగ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా వస్తున్న సినిమా డార్లింగ్. పెళ్లి కష్టాల నేపథ్యంలో ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతుంది. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై ఆసక్తి పెరిగింది. ఈసినిమా జులై 19వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

కల్కిలో నా ఫేవరేట్ క్యారెక్టర్ అదే - నాగ్ అశ్విన్
టాలీవుడ్ విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 AD’. ఈ విజువల్ వండర్ లో పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె లీడ్ రోల్స్ లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఇన్‌స్టాగ్రామ్ నుండి వైదొలిగిన విశ్వక్ సేన్, ఎందుకంటే..?
టాలీవుడ్ మాస్ కాదాస్ విశ్వక్ సేన్ ఈ యేడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఆయన 'మెకానిక్ రాఖి', 'లైలా' అనే చిత్రాలలో నటిస్తున్నాడు. ఇక ఇదిలావుండగా, తాజాగా విశ్వక్ సేన్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి వైదొలిగాడు. ఇది ఆయన అభిమానులకు కాస్త షాకింగ్‌గా అనిపించింది.

వెంకీ 76 గురించి క్లారిటి ఇచ్చిన డైరెక్టర్
విక్టరీ వెంకటేష్,అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మూడో సినిమా తెరకెక్కనుందని తెలిసిందే.రెండు రోజుల క్రితం లాంఛ్ కూడా అయ్యింది.ఈ నెల మూడో వారం నుండి షూటింగ్ కూడా మొదలుకానుంది.నవంబర్ కల్లా పూర్తి చేయనున్నారు.ఇక ఈసినిమా లో మరో హీరో కూడా ఉంటాడని వార్తలు వచ్చాయి.అయితే ఈ న్యూస్ పై స్పందించాడు అనిల్ రావిపూడి.ఇందులో వెంకటేష్ గారు ఒక్కరే హీరో మరో హీరో లేడు.ఇది ఎఫ్ 4 కాదు వేరే జోనర్ లో రానుంది.వచ్చే సంక్రాంతి కి విడుదలకానుందని క్లారిటీ ఇచ్చాడు.ఇందులో ఐశ్వర్య రాజేష్,మీనాక్షి చౌదరి ఫిమేల్ లీడ్ రోల్స్ లో కనిపించనున్నారు.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.మరి వెంకీ ,అనిల్…

ఉస్తాద్ భగత్ సింగ్- ఆగిపోయిందన్న వార్తలపై హరీష్ కౌంటర్
హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాబట్టి ఈసినిమాపై అంచనాలు ఏర్పడటం కామనే. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటివరకూ కొంతమేరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. దీంతో హరీష్ శంకర్ రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో బిజీ అయిపోయాడు. ఒక్కసారి పవన్ ఫ్రీ అయి డేట్స్ ఇవ్వడమే తరువాయి హరీష్ ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేస్తాడు.

అలియా భట్ హీరోయిన్‌గా స్పై మూవీ
దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దర్సకత్వంలో జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్. 'గంగూబాయి కతియావాడి' సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ తాజాగా కొత్త మూవీకి శ్రీకారం చుట్టింది.