పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ భామ దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటించగా.. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ విలన్‌గా నటించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వైజయంతి మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. అంచనాలకు తగ్గట్టుగానే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో ఈ చిత్రం ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్‌తో కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో కల్కిపై మూవీ లవర్స్‌తోపాటు దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదేక్రమంలో తాజాగా ‘సీతారామం’ ఫేమ్ మృణాళ్ ఠాకూర్ ఈ సినిమాపై తన స్పందనను తెలియజేసింది. కాగా ఈ చిత్రంలో మృణాల్ స్పెషల్ రోల్ పోషించడం గమనార్హం. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించింది. దర్శకుడు నాగ్ అశ్విన్, హీరో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణేల ప్రతిభను కొనియాడింది.
“కల్కి 2898 ఏడీ విజువల్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. టీం అంతా అద్భుతంగా పనిచేశారు. నటీనటుల నుండి సెట్స్ వరకు, సంగీతం, వీఎఫ్‌ఎక్స్, కాస్ట్యూమ్స్.. ఇలా ప్రతీ ఒక్కటి అద్బుతంగా కుదిరాయి. నాగ్ అశ్విన్ గారూ.. మీ విజన్‌కి మరియు ఈ కళాఖండానికి జీవం పోసినందుకు, మీకు హ్యాట్సాఫ్. అమితాబ్ బచ్చన్ సార్ మీరు నిజంగానే షాహెన్ షా. అశ్వత్థామగా మీ నటన అద్భుతంగా ఉంది, ప్రతీ సన్నివేశంలో మీరు కమాండ్ చేసిన విధానం నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది!!! కమల్ హాసన్ సార్ మీ యాక్టింగ్ నమ్మశక్యం కాని విధంగా ఉంది” అని పేర్కొన్నారు.
ఇంకా మృణాల్ ఇలా తెలిపారు.. దీపికా పదుకొణే మీరు అద్భుతంగా నటించారు, మీదైన నటనతో సుమతి పాత్రకు జీవం పోశారు. తెరపై మిమ్మల్ని చూడటాన్ని నేను ఇష్టపడుతున్నాను. ప్రభాస్ గారూ, మీ పాత్రలోని ప్రతి అంశాన్ని మరియు మీరు భైరవగా నటించిన తీరు చాలా నచ్చింది. అలాగే సినిమాలో నాకు ఇష్టమైన భాగం బుజ్జి (కీర్తి సురేష్)తో మీ డైనమిక్ మరియు బాండింగ్. ఇది చాలా అందంగా ఉంది, నాకు బాగా నచ్చింది” అని అన్నారు.
“మన సినిమాల్లో ఒకటి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించడం చాలా హృద్యంగా ఉంది, వైజయంతి సినిమాస్, స్వప్న దత్, ప్రియాంక దత్ మరియు అశ్విని దత్ సార్, ఈ కళాఖండానికి మీ సహకారం అందించినందుకు అభినందనలు. నాగ్ అశ్విన్ గారూ, ఈ అద్భుతమైన చిత్రంలో నేను చిన్న భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది. కాగా ఇప్పుడీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: