తెలుగు ప్రేక్షకులందరూ ముద్దుగా ‘జక్కన్న’ అని పిలుచుకునే టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అంటే ఇండియాలో తెలియనివారుండరు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తరువాత అయితే ఆయన ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఈ సినిమా ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై సత్తా చాటడంతో రాజమౌళి పేరు అనేక దేశాల్లో మారుమ్రోగిపోయింది. వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ చాలామంది ఆయనకు అభిమానులయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీంతో రాజమౌళి గతంలో దర్శకత్వం వహించిన పలు సినిమాలను ఓటీటీ లలో వీక్షించడానికి వారు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు రాజమౌళి గురించి తెలుసుకోవాలని ఆయా దేశాల్లో ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సంస్థ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న డైరెక్టర్ రాజమౌళి అభిమానులకు గుడ్ న్యూస్ అందించింది. రాజమౌళి సినీ జీవితంపై స్పెషల్ డాక్యుమెటరీ ఒకటి రూపొందించినట్లు ప్రకటించింది. నెట్ఫ్లిక్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న మోడర్న్ మాస్టర్స్ సిరీస్లో భాగంగా రాజమౌళిపై డాక్యుమెంటరీ రూపొందించింది. దీనికి మాడర్న్ మాస్టర్స్: ఎస్.ఎస్ రాజమౌళి (Modern Masters: S.S. Rajamouli) అనే పేరు పెట్టింది.
కాగా ఈ డాక్యుమెటరీని త్వరలోనే ప్రసారం చేయనున్నట్లు తెలిపింది. తాజాగా దీనిపై కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు చిత్రబృందం, ఆగష్టు 2 నుంచి ఈ డాక్యుమెటరీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మాడర్న్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి పేరుతో రూపొందిన ఈ డాక్యుమెంటరీలో.. జక్కన్న తన చిత్రాలతో ఇండియన్ సినిమాతోపాటు ప్రపంచ సినిమాపై చూపిన ప్రభావాన్ని చూపించనున్నారు.
ఈ డాక్యుమెంటరీని అనుపమ చోప్రా సమర్పిస్తుండగా.. ఇందులో హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరాన్, జో రుసో, కరణ్ జోహార్ లాంటి వాళ్లు కూడా రాజమౌళిపై తమ అభిప్రాయాలు పంచుకోనుండటం విశేషం. వీరితోపాటు రాజమౌళి చిత్రాలలో నటించిన టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా దగ్గుబాటి తదితరులు ఆయన గురించి చెప్పిన ఆసక్తికర విషయాలను చూపించనున్నారు.
ఇక నెట్ఫ్లిక్స్ దీనితోపాటు ఈ ఏడాది అనేక ఇతర డాక్యుమెంటరీలను కూడా రూపొందించింది. వీటిలో ‘ది గ్రేటెస్ట్ రైవల్రీ ఇండియా వర్సెస్ పాకిస్థాన్’, ‘యో యో హనీ సింగ్: ఫేమస్’ అనే డాక్యుమెంటరీలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజమౌళిపై తీసిన డాక్యుమెంటరీలో ఆయన జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను, ఆయన గురించి బయటివారికి అంతగా తెలియని కొత్త కోణాలను ఆవిష్కరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























