టాలీవుడ్ మాస్ కాదాస్ విశ్వక్ సేన్ ఈ యేడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఆయన ‘మెకానిక్ రాఖి’, ‘లైలా’ అనే చిత్రాలలో నటిస్తున్నాడు. ఇక ఇదిలావుండగా, తాజాగా విశ్వక్ సేన్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి వైదొలిగాడు. ఇది ఆయన అభిమానులకు కాస్త షాకింగ్‌గా అనిపించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విశ్వక్ సాధారణంగా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్లను సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడిస్తుంటాడు. అలాంటిది ఆయన సడన్‌గా ఎందుకు ఇలా చేశాడు? అని వారు ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విశ్వక్ సేన్ ఈ వ్యవహారంపై స్పందించాడు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు.
“అందరికి హాయ్, ఒకసారి చుడండి, నేను సోషల్ మీడియా డిటాక్స్‌ను ప్రారంభించడం గురించి ఒక కథనాన్ని పోస్ట్ చేసాను. ఇది ఇన్‌స్టాగ్రామ్ నుండి చిన్న విరామం, చింతించాల్సిన పనిలేదు. నా టీమ్ ఎక్కువగా నా ట్విట్టర్‌ని నిర్వహిస్తుంది, కాబట్టి నా ఇన్‌స్టాగ్రామ్ డీయాక్టివేషన్ గురించి ఒత్తిడి చేయవద్దు. ఇన్‌స్టాగ్రామ్‌ను డీయాక్టివేట్ చేయడం వల్ల, తర్వాత నాకు.. అంతా బాగానే ఉందా? అని అడిగే సందేశాలు రావొచ్చు” అని అందులో తెలిపాడు.
ఇంకా విశ్వక్ ఇలా అన్నాడు.. “అయితే ఇది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే, ఎప్పటికీ సోషల్ మీడియా ఉనికి నా వ్యక్తిగత జీవితాన్ని నిర్వచించదు. సోషల్ మీడియాను కొంత వరకు మాత్రమే సీరియస్‌గా తీసుకోవాలని నేను ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తున్నాను. నేను మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్ లోకి తిరిగి రావచ్చు, లేదా రాకపోవచ్చు. ధన్యవాదాలు!” అని పేర్కొన్నాడు. ఇక విశ్వక్ పోస్ట్‌పై ఫ్యాన్స్.. ‘మాస్ కా దాస్ ఏది చేసినా సంచలనమే’ అని అంటున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: