అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా వస్తున్న సినిమా డార్లింగ్. పెళ్లి కష్టాల నేపథ్యంలో ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతుంది. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై ఆసక్తి పెరిగింది. ఈసినిమా జులై 19వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా టీజర్ ను ఇప్పటికే రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ కు సిద్దమయ్యారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. రేపు అంటే జులై 7వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
కాగా ఇంకా ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, శివ రెడ్డి, కృష్ణ తేజ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. చైతన్య రెడ్డి సమర్పణలో నిరంజన్ రెడ్డి ప్రైమ్ షో ఎంటర్ టైనమెంట్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: