కుమార్తెకు నామ‌క‌ర‌ణం చేసిన మంచు మనోజ్ దంపతులు

Manchu Manoj Reveals His Baby Daughter Name

టాలీవుడ్ స్టార్ హీరో మంచు మనోజ్ అభిమానులకు ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. ఏప్రిల్ 13న ఆయన సతీమణి భూమా మౌనికా రెడ్డి పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా హీరో మనోజ్ తమ ముద్దుల తనయను ప్రపంచానికి పరిచయం చేశాడు. సోమవారం పాప‌కు నామ‌క‌ర‌ణ మహోత్సవం నిర్వహించారు. వైభవంగా జరిగిన ఈ వేడుక‌కు మంచు ఫ్యామిలీతో పాటు మౌనిక కుటుంబ స‌భ్యులు హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సందర్భంగా తమ చిన్నారికి ‘దేవసేన శోభా ఎంఎం’ అని నామకరణం చేసినట్టు వెల్లడించాడు. సుబ్రహ్మణ్యస్వామి భార్య దేవసేన పేరు మరియు తన అత్తగారి పేరు శోభా కలిసి వచ్చేలా ఈ పేరు పెట్టినట్లు మనోజ్ తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో తెలిపిన మంచు మ‌నోజ్.. అభిమానులను ఉద్దేశించి మీ ఆశీస్సులు ఈ ఫ్యామిలీపై ఉండాలని కోరుకుంటున్నా అంటూ ఆకాంక్షించాడు.

ఇక మంచు మనోజ్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలోని ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన భూమా మౌనికా రెడ్డిని గత కొంతకాలం క్రితం ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. భూమా మౌనిక తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి మరియు భూమా శోభా నాగిరెడ్డిలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే 2014 ఎన్నికలకు ముందు ఏప్రిల్ 24న శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. అనంతరం 2017 మార్చి 12న భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించారు.

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్
ఆన్‌లైన్‌ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.