కుబేర నుండి నిన్న రష్మిక ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను విడుదలచేశారు. ఈ గ్లింప్స్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. రష్మీక ఒక సూట్ కేస్ తో కనిపించడం అందులో డబ్బు ఉండడం దాన్ని కప్పి పెట్టడానికి ఓ గొయ్యి తవ్వడం ఇవ్వని ఆ గ్లింప్స్ లో కనిపించాయి.ఇవన్నీ ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ఇప్పటివరకు 7 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ ను రాబట్టుకొంది.హీరోయిన్ ఫస్ట్ లుక్ కు ఈ రేంజ్ లో వ్యూస్ రావడం గొప్ప విషయమే. ఇంతకుముందు నాగార్జున ఫస్ట్ లుక్ ను కూడా గ్లింప్స్ రూపంలో విడుదలచేశాడు. ఒక్క ధనుష్ లుక్ ను మాత్రమే పోస్టర్ ద్వారా రివీల్ చేశాడు. మొత్తానికి ఈసారి శేఖర్ కమ్ముల గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినిమాకూడా బాగానే వస్తుందని టాక్. రెగ్యులర్ శేఖర్ కమ్ముల సినిమాలా కాకుండా కుబేర చాలా కలర్ ఫుల్ గా ఉండనుంది.దీనికి మైథాలజీ టచ్ కూడా ఇవ్వనున్నాడట. ఓవరాల్ గా ఇప్పటివరకు హైప్ బాగానే వచ్చింది.షూటింగ్ కూడా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.సెప్టెంబర్ లోకల్లా షూటింగ్ ను పూర్తి చేయనున్నారు.ఈఏడాది చివర్లో విడుదలచేయడానికి ప్లాన్ చేస్తున్నారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్,పుస్కూర్ రామ్ మోహన్ నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























