టాలీవుడ్ విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 AD’. ఈ విజువల్ వండర్ లో పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె లీడ్ రోల్స్ లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైథాలజీ-ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ జూన్ 27న గ్రాండ్ గా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షులని మహా అద్భుతంగా అలరించి, ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో హౌస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కల్కి చిత్రంపై రివ్యూ ఇచ్చారు.
ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా.. “వావ్!! కల్కి 2898 AD టీమ్ మొత్తానికి అభినందనలు మరియు కృతజ్ఞతలు. వాట్ ఏ బ్రిలియంట్ మేకింగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. మా డార్లింగ్ ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ పెర్ఫార్మెన్స్ సూపర్బ్. ఇక సీనియర్ బచ్చన్ సర్ మీ నటన శిఖరాగ్రాన నిలిచింది. ఉలగనాయకన్ కమల్ హాసన్ సార్ మీ యాక్టింగ్ ఎప్పటికీ అంతం లేని ప్రకాశం వంటిది” అని పేర్కొన్నాడు.
ఇంకా ఆయన ఇలా అన్నాడు.. “దీపికా పదుకొణే నటనలోని ఇంటెన్సిటీ, దిశా పటానీ యొక్క అద్భుతమైన ఉనికి ఈ సినిమాకు ఎంతో ఉపకరించింది. ఇక అన్నింటికంటే అశ్వినీ దత్ అంకుల్ మరియు వైజయంతీ ఫిల్మ్స్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లినందుకు స్వప్న దత్, ప్రియాంక దత్‌లను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. సోదరుడు సంతోష్ నారాయణ్ అందించిన సంగీతం, కెమెరామెన్ మరియు VFX బృందం మరియు ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ హ్యాట్సాఫ్” అని తెలిపారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























