అలియా భట్ హీరోయిన్‌గా స్పై మూవీ

Alia Bhatt and Sharvari's Spy Action Movie is Titled Alpha

దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దర్సకత్వంలో జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్. ‘గంగూబాయి కతియావాడి’ సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ తాజాగా కొత్త మూవీకి శ్రీకారం చుట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించనున్న ఈ చిత్రం స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ‘ది రైల్వే మెన్’ వెబ్ సిరీస్ ఫేమ్ శివ్ రావైల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటి శార్వరి ఓ కీలక పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ చిత్రానికి ‘ఆల్ఫా’ అని టైటిల్ ఖరారు చేశారు. ఈ మేరకు మేకర్స్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఆదిత్యచోప్రా గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో నటించనున్న నటీనటులు మరియు పనిచేయనున్న ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.

ఆన్‌లైన్‌ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.