కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

డబుల్ ఇస్మార్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్

double ismart movie count countdown started

డబుల్ ఇస్మార్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్

Double Ismart Movie Count Countdown Started

double ismart movie count countdown started

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇన్ని రోజులు షూటింగ్ బిజీగా ఉండగా..ఈసినిమా రీసెంట్ గానే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమా కౌండ్ డౌన్ స్టార్ట్ మొదలయిందని తెలుపుతూ.. రిలీజ్ కు 40 రోజులు మాత్రమే ఉందని తెలియచేస్తూ రామ్ ఇంకా సంజయ్ దత్ కలిసి ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ అయితే ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో కావ్యా థాపర్‌ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాలో ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో అలీ, షయాజీ షిండే, గెటప్ శ్రీను, ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈసినిమాను పూరి కనెక్ట్స్‌ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. శ్యామ్ కే నాయుడు, జియాని జియానెలి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్