హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాబట్టి ఈసినిమాపై అంచనాలు ఏర్పడటం కామనే. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటివరకూ కొంతమేరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. దీంతో హరీష్ శంకర్ రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో బిజీ అయిపోయాడు. ఒక్కసారి పవన్ ఫ్రీ అయి డేట్స్ ఇవ్వడమే తరువాయి హరీష్ ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేస్తాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా మొదలైన దగ్గరనుండి ఈసినిమాపై పలు రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా సినిమా ఆగిపోయిందనే వార్తలే ఎక్కువగా వచ్చాయి. అయితే అప్పుడప్పుడు మేకర్స్ వీటిపై స్పందిస్తూ క్లారిటీ ఇస్తూ వస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి అలాంటి వార్తే తెరపైకి వచ్చింది. ఒక మీడియా సంస్థ తమ ట్విట్టర్ ద్వారా ఈసినిమా ఆగిపోయిందంటూ పోస్ట్ చేసింది. ఇక దీనిపై ఒక నెటిజన్ తన ట్విట్టర్ ద్వారా నీ నుండి వాళ్లు రిప్లై ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.. ఎలాంటి రిప్లై ఇవ్వద్దు అంటూ ఆ పోస్ట్ ను హరీష్ శంకర్ కు ట్యాగ్ చేయగా.. హరీష్ శంకర్ ఆ ట్వీట్ కు రిప్లై ఇస్తూ సినిమా స్టార్ట్ అవ్వదు అన్నప్పుడే రూమర్స్ పట్టించుకోలేదు.. ఇప్పుడు రూమర్స్ చదివే టైం కూడా లేదు అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు.
కాగా ఈసినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























