నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. నాని 31వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి ‘బ్రోచేవారెవరురా’, ‘మెంటల్ మదిలో’ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రముఖ కోలీవుడ్ దర్శక,నటుడు ఎస్జే సూర్య, సాయికుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాతలు డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలను ముమ్మురం చేసింది. దీనిలో భాగంగా ఇప్పటికే మూవీ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా మరో సూపర్ అప్డేట్ అందించింది.
సరిపోదా శనివారం నుంచి హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. అలాగే తన పాత్ర పేరు చారులతగా రివీల్ చేశారు. ఇక ఈ పోస్టర్ గమనిస్తే.. ప్రియాంక మోహన్ ఈ చిత్రంలో లేడి పోలీస్‌గా నటిస్తున్నట్లు అర్థమవుతుంది. ‘అంటే సుందరానికి’ సినిమా తర్వాత నాని, వివేక్ కాంబో రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























