కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

మరో రికార్డ్ సృష్టించిన కల్కి

Kalki 2898 AD Movie Creates New Record by Book My Show

మరో రికార్డ్ సృష్టించిన కల్కి

Kalki 2898 AD Movie Creates New Record by Book My Show

Kalki 2898 AD Movie Creates New Record by Book My Show

టాలీవుడ్ విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 AD’. ఈ విజువల్ వండర్‌లో పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా.. బాలీవుడ్ భామలు దీపికా పదుకొణె, దిశా పటాని ఫిమేల్ లీడ్ రోల్స్‌ పోషించారు. అలాగే ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించారు.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. అంచనాలకు తగ్గట్టుగానే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో ఈ చిత్రం ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది.

ఈ నేపథ్యంలో కల్కి 2898 AD చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను సృష్టిస్తోంది. ఇండియాలోనే కాకుండా ఓవర్‌సీస్‌లో సైతం ఈ మూవీ పలు రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ క్రమంలో తాజాగా కల్కి చిత్రం మరో కొత్త రికార్డును సృష్టించింది. ఈ సినిమా విడుదలైనప్పటినుంచీ ఇప్పటివరకూ బుక్ మై షో ద్వారా 10 మిలియన్ పైగా టికెట్లను సేల్ అందుకుంది. ఈ మేరకు విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్