ట్యాగ్ · 1187 కథనాలు · పేజీ 44

రారాజు కృష్ణంరాజు

మీ అమ్మలతో ఒకే ఒక జీవితం సినిమా చూడండి

రెగ్యులర్ షూట్ కు రెడీ అవుతున్న హరిహర వీరమల్లు

100 రోజులు పూర్తిచేసుకున్న మేజర్

సైమా అవార్డ్స్ లో పుష్ప :ది రైజ్ ప్రభంజనం

ఈ రోజే భారీ యాక్షన్ సీన్ తో #SSMB 28 షూటింగ్ ప్రారంభం

రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత

హిట్ లేకపోతే ఎలా ఉంటుందో తెలుసు

'కృష్ణ వ్రింద విహారి' ట్రైలర్ రిలీజ్

సూర్య 42 మూవీ తో దిశా పటాని కోలీవుడ్ ఎంట్రీ

సెప్టెంబర్ 9 వ తేదీ నాగార్జున - అమల ల స్పెషల్ డే

1800 పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన సమంత యశోద టీజర్

ఎన్టీఆర్ ను చూడాలని కోరిన వెస్టిండీస్ కెప్టెన్

మాలీవుడ్ లో కార్తికేయ 2 మూవీ రిలీజ్
పుష్పరాజ్ తో పూజా హెగ్డే
బ్లాక్ బస్టర్ దువ్వాడ జగన్నాధమ్ , అల .. వైకుంఠపురములో .. మూవీస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , పూజా హెగ్డే తమ అద్భుతమైన స్క్రీన్ కెమిస్ట్రీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. పూజా హెగ్డే ప్రస్తుతం సర్కస్ , కభీ ఈద్ కభీ దివాలీ (హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు #SSMB28, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న జనగణమన మూవీస్ లో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కనున్న తమిళ మూవీ లో సూర్య కు జోడీగా పూజా హెగ్డే ఎంపిక అయినట్టు సమాచారం. బ్లాక్ బస్టర్ పుష్ప :ది రైజ్ మూవీ…

రారాజు కృష్ణంరాజు
చిలకా గోరింకా (1966) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృష్ణంరాజు హీరో, విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్ , ఏ ఎన్ ఆర్ , కృష్ణ , శోభన్ బాబు , మోహన్ బాబు , చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున , సుమన్ , జగపతి బాబు , ప్రభాస్ , శ్రీకాంత్ , నాని లతోపలు సినిమాలలో కృష్ణం రాజు నటించారు. గోపీకృష్ణా మూవీస్ బ్యానర్ స్థాపించి కృష్ణంరాజు వాణిశ్రీ కథానాయికగా కృష్ణవేణి మూవీ ని నిర్మించారు. ఆ మూవీ ఘనవిజయం సాధించి కృష్ణంరాజు కెరీర్ ను మలుపు తిప్పింది. గోపీకృష్ణా మూవీస్ బ్యానర్ పై బాపు దర్శకత్వంలో కృష్ణం రాజు , వాణిశ్రీ జంటగా తెరకెక్కిన భక్త కన్నప్ప బ్లాక్…

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు
సమ్మోహనం, వి సినిమాల తరువాత ఇంద్రగంటి మోహనకృష్ణ, సుధీర్ బాబు దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనానే ఉన్నాయి. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో కూడా స్పీడు పెంచారు మేకర్స్. ఇప్పటికే విడుదల చేసిన ఈసినిమా పోస్టర్లు, టీజర్, పాటలు అలానే ట్రైలర్ పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

మీ అమ్మలతో ఒకే ఒక జీవితం సినిమా చూడండి
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మొత్తానికి మంచి హిట్ ను సొంతంచేసుకున్నాడు. చాలా కాలం నుండి శర్వాకు హిట్ లేకుండా పోయింది. వరుసగా సినిమాలు అయితే చేసుకుంటూ వెళుతున్నాడు కానీ సరైన హిట్ చూసి చాలా రోజులే అవుతుంది. దీంతో శర్వా కూడా ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇన్ని రోజులకు తను వెయిట్ చేసిన దానికి ఒకే ఒక జీవితంతో ఫలితం దక్కింది. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తల్లి సెంటిమెంట్ ను కూడా కలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో దూసుకుపోతుంది. విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది.

మూడు రోజులకు 125 కోట్ల తో దూసుకుపోతోన్న బ్రహ్మాస్త్ర పార్ట్ 1శివ
స్టార్ స్టూడియోస్ , ధర్మా ప్రొడక్షన్స్ , స్టార్ లైట్ పిక్చర్స్ ,ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ , అలియా భట్ జంటగా సోషియో ఫాంటసీ బ్రహ్మాస్త్ర హిందీ మూవీ 3 పార్ట్స్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ సెప్టెంబర్ 9 వ తేదీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీ లో కింగ్ నాగార్జున , అమితాబ్ బచ్చన్ , మౌని రాయ్ , డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలలో నటించగా బాలీవుడ్ బాద్ షా అతిథి పాత్రలో నటించారు. ప్రీతం సంగీతం అందించారు.విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో రణబీర్ , అలియా భట్ అద్భుతంగా పెర్ఫార్మ్…

రెగ్యులర్ షూట్ కు రెడీ అవుతున్న హరిహర వీరమల్లు
వవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోపక్క సినిమాలను చేసుకుంటూ వెళుతున్నారు. అయితే ఆయన రాజకీయల్లో బిజీగా ఉండటంతో ఆ ఎఫెక్ట్ మాత్రం సినిమా షూటింగ్ లపై ఖచ్చితంగా పడుతుంది అని చెప్పొచ్చు. దానికి నిదర్శనమే హరిహర వీరమల్లు సినిమా. ఎపుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా వస్తుండగా.. ఈసినిమాను భీమ్లానాయక్ కంటే ముందు మొదలుపెట్టాడు. ఆ సినిమా కూడా ముందు కంప్లీట్ అయి రిలీజ్ అయిపోయింది. ఇక హరిహర వీరమల్లు సినిమాకే ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి. ఈసినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా…

100 రోజులు పూర్తిచేసుకున్న మేజర్
విభిన్నమైన కథలతో మంచి విజయాలు సాధించవచ్చని మరోసారి మేజర్ సినిమాతో నిరూపించాడు అడివి శేష్. అడివి శేష్ ప్రధాన పాత్రలో శశికిరణ్ టిక్క దర్శకత్వం వహించిన ఈసినిమా జూన్3న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముంబై బాంబు దాడుల్లో అమర వీరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. దేశవ్యాప్తంగా ఈసినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుందో చూశాం కదా. శేష్ తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. సందీప్ పాత్రలో శేష్ పెర్ఫార్మన్స్, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలు ఈ మూవీకి ప్రధాన బలంగా నిలిచాయి. అందులోనూ పేట్రియాటిక్ మూవీగా రూపొందించిన సినిమా కాబట్టి అన్ని…

సైమా అవార్డ్స్ లో పుష్ప :ది రైజ్ ప్రభంజనం
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో…

ఈ రోజే భారీ యాక్షన్ సీన్ తో #SSMB 28 షూటింగ్ ప్రారంభం
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో మూవీ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా తెరకెక్కనుంది. అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB 28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత
ఈరెండేళ్లలో ఎంతో మంది సినీ ప్రముఖులను కోల్పోయింది తెలుగు సినీ పరిశ్రమ. ఎంతో మంది లెజెండరీ నటీనటులు, గాయకులు, రచయితలు ఇలా ఎంతోమందిని సినీ పరిశ్రమ కోల్పోయింది. ఇక తాజాగా మరో సీనియర్ లెజెండరీ హీరోను ఇండస్రీ కోల్పోయింది. ఆ నటుడు ఎవరో కాదు రెబల్ స్టార్ కృష్ణం రాజు. పాత తరం నాయకుల్లో ఇండస్ట్రీకి అండగా పెద్దగా ఉన్న హీరో కృష్ణంరాజు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు ఏఐజీ ఆస్పత్రిలో నేడు తెల్లవారుజామున మృతి చెందారు. కృష్ణం రాజు మృతితో టాలీవుడ్ మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఇక కృష్ణంరాజు మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియచేస్తున్నారు.

హిట్ లేకపోతే ఎలా ఉంటుందో తెలుసు
ఎంత స్టార్ హీరో అయినా సరే హిట్ తప్పని సరి. ఏదో ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయితే పెద్దగా పట్టింకోరు కానీ.. వరుసగా ఫ్లాప్స్ వస్తేనే అటు అభిమానులకు మాత్రమే కాదు హీరోలకు కూడా చాలా సమస్యగా ఉంటుంది. ఇక ఇప్పుడున్న పోటీ వాతావరణంలో హీరోలకు వరుసగా ఫ్లాప్స్ వస్తే ఎలాంటి కామెంట్స్ వినిపిస్తాయో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక యంగ్ హీరో శర్వానంద్ కూడా ఇదే విషయం చెబుతున్నాడు. ఫ్లాప్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసని అంటున్నాడు శర్వానంద్.

'కృష్ణ వ్రింద విహారి' ట్రైలర్ రిలీజ్
అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కృష్ణ వ్రింద విహారి. ఈసినిమా సెప్టెంబర్ 23వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఈ క్రమంలో మేకర్స్ వరుసగా అప్‌డేట్‌లను ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు.ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పాటలు అలానే టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

సూర్య 42 మూవీ తో దిశా పటాని కోలీవుడ్ ఎంట్రీ
రీసెంట్ గా ఆకాశం నీ హద్దురా , జై భీమ్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన హీరో సూర్య 42 వ మూవీ షూటింగ్ చెన్నై లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే.యు వి క్రియేషన్స్ ,స్టూడియో గ్రీన్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన శివ దర్శకత్వంలో సూర్య హీరోగా తమిళ , తెలుగు భాషలలో భారీ బడ్జెట్, 3 D ఫార్మాట్ తో సూర్య 42 మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో హీరో సూర్య కు జోడీగా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటాని నటిస్తున్నారు. ఈ మూవీ తో దిశా పటాని కోలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారు.

సెప్టెంబర్ 9 వ తేదీ నాగార్జున - అమల ల స్పెషల్ డే
స్టార్ స్టూడియోస్ , ధర్మా ప్రొడక్షన్స్ , స్టార్ లైట్ పిక్చర్స్ ,ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ , అలియా భట్ జంటగా సోషియో ఫాంటసీ బ్రహ్మాస్త్ర హిందీ మూవీ 3 పార్ట్స్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ సెప్టెంబర్ 9 వ తేదీ రిలీజ్అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీ లో కింగ్ నాగార్జున , అమితాబ్ బచ్చన్ , మౌని రాయ్ , డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలలో నటించగా బాలీవుడ్ బాద్ షా అతిథి పాత్రలో నటించారు. ప్రీతం సంగీతం అందించారు.విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో రణబీర్ , అలియా భట్…

1800 పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన సమంత యశోద టీజర్
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. నిజ జీవిత సంఘటన తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. పాన్ ఇండియా మూవీ గా సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన యశోద మూవీలో కీలక యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ తెరకెక్కించారు.

ఎన్టీఆర్ ను చూడాలని కోరిన వెస్టిండీస్ కెప్టెన్
తెలుగు సినీ చరిత్రలో నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు వేసిన ముద్ర గురించి చెప్పడం ఆసాధ్యం. తెలుగు సినీ పరిశ్రమ బ్రతికి ఉన్నంతకాలం ఆయన కూడా సజీవంగా ఉన్నట్టే. ఆయన ఏ పాత్ర చేస్తే ఆపాత్ర కోసం ఆయన పుట్టినట్టు చేస్తారు. యావత్ ప్రపంచ చలన చిత్ర రంగంలోనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నెలకొల్పినన్ని రికార్డులు నెలకొల్పటం మరి ఏ ఇతర నటుడికి సాధ్యం కాదు. సాంఘికమైనా, జానపదమైనా, పౌరాణికమైనా.. పాత్ర ఏదైనా ఆయనకు నల్లేరు మీద నడకే. సాంఘిక చిత్రాలు ఎన్టీఆర్ కు నటుడిగా మంచి గుర్తింపునిస్తే.. పౌరాణిక చిత్రాలు మాత్రం ఎన్టీఆర్ ను ఆకాశానికెత్తేశాయి. పురాణాల్లో చెప్పుకునే శ్రీకృష్ణుడు, రాముడు, రావణుడు…

ఓనం పండగ స్పెషల్ శారీ లో దేవకన్య గా కీర్తి సురేష్
తెలుగు , తమిళ ,మలయాళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.భోళా శంకర్ మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే. దసరా(తెలుగు ), మామన్నన్ (తమిళ ), వాషి (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు. తాజాగా కీర్తి ప్రధాన పాత్రలో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై సుధా కొంగర దర్శకత్వంలో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కనుంది.

హీరో ప్రభాస్ బర్త్ డే కు వర్షం , బిల్లా మూవీస్ రీ రిలీజ్
ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల బర్త్ డేస్ కు వారి పాత సూపర్ హిట్ మూవీస్ ను నూతన టెక్నాలజీ తో రీరిలీజ్ చేసే ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే . సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా పోకిరి మూవీ 4k తో స్పెషల్ షోస్ వేయగా భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఘరానామొగుడు చిత్రాన్ని విడుదల చేయగా.. దానికి కూడా రెస్పాన్స్ వచ్చింది. ఇక సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా జల్సా సినిమాను రీరిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది.

మాలీవుడ్ లో కార్తికేయ 2 మూవీ రిలీజ్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తికేయ 2 మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించింది…

బిగ్ బాస్ 6 మొదటి కెప్టెన్ గా మిస్టర్ కూల్
బిగ్ బాస్ 6 లో ఐదు రోజులు పూర్తయిపోయాయి. ఇక మొదటి రోజు నుండే గొడవలతో మొదలైన బిగ్ బాస్ సీజన్ 6 అదే కొనసాగుతూ వస్తుంది. ఇక మొదటి నాలుగు రోజులు పలు ఆటలు ఆడించిన బిగ్ బాస్ ఫైనల్ గా ఈ సీజన్ మొదటి కెప్టెన్సీ టాస్క్ నిర్వహించాడు.