‘కృష్ణ వ్రింద విహారి’ ట్రైలర్ రిలీజ్

Krishna Vrinda Vihari,Krishna Vrinda Vihari Movie,Krishna Vrinda Vihari Telugu Movie,Krishna Vrinda Vihari Movie Teaser,Krishna Vrinda Vihari Telugu Movie Teaser,Krishna Vrinda Vihari Movie Teaser Released,Krishna Vrinda Vihari Teaser Out Now,Krishna Vrinda Vihari Latest Updates,Naga Shaurya,Hero Naga Shaurya Upcoming Movie Krishna Vrinda Vihari Teaser Released,Shirley Setia,Actress Shirley Setia, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

అనీష్​ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కృష్ణ వ్రింద విహారి. ఈసినిమా సెప్టెంబర్ 23వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఈ క్రమంలో మేక‌ర్స్ వ‌రుస‌గా అప్‌డేట్‌ల‌ను ప్ర‌క‌టిస్తూ సినిమాపై ఆస‌క్తిని క్రియేట్ చేస్తున్నారు.ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పాటలు అలానే టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ట్రైలర్ ను నేడు రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ మాత్రం ఆకట్టుకుంటుంది. కామెడీ, యాక్షన్, లవ్… న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా ఉందీ సినిమా. ట్రైలర్ విషయానికి వస్తే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అబ్బాయిగా నాగ శౌర్య కనిపించారు. ఇక హీరోయిన్ మోడ్రన్ అమ్మాయి. అలాంటి అమ్మాయి ప్రేమలో పడతాడు నాగశౌర్య. వెన్నెల కిశోర్, సత్య కామెడీ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రైలర్ మొత్తంలో హైలైట్ ఏంటంటే… ”ఎఫ్ 2’లో వెంకీ మామ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్. ప్రపంచంలో బాధలు అన్నీ వాళ్ళే భరిస్తున్నారని అంటారే? మరి, వాళ్ళను భరిస్తున్న మనల్ని ఏమనాలి?” అని హీరో నాగ శౌర్య చెప్పిన డైలాగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే ఈసినిమాలో విజువల్స్ కూడా చాలా నీట్ గా బాగున్నాయి. మొత్తానికి సినిమా రిలీజ్ కాస్త లేట్ అయినా కూడా ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ గా ఈసినిమా అలరించే అవకాశం ఉంది. చూద్దాం మరి నాగశౌర్యకు ఈసినిమా ఎలాంటి విజయం అందిస్తుందో.

కాగా ఈసినిమాలో షిర్లే సెటియా హీరోయిన్ గా నటిస్తుండగా.. రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు పలు కీలక పాత్రల్లో నటించనున్నారు. ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం అందిస్తుండగా.. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.