సెప్టెంబర్ 9 వ తేదీ నాగార్జున – అమల ల స్పెషల్ డే

September 9th Becomes a Special Day for Nagarjuna and Amala,Telugu Film News 2022, Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,latest telugu movies news,King Nagarjuna,Akkineni Nagarjuna,Nagarjuna and Amala,Special Day for Nagarjuna and Amala on September 9th,Nagarjuna Brahmastra Movie,Amala Oke oka Jeevitham Movie,Nagarjuna in Brahmastra Telugu Movie,Nagarjuna Brahmastra Movie Released on Spetember 9th,Nagarjuna Upcoming Movies,Actress Amala,Amala Latest Movie Oke Oka Jeevitham Movie Released On September 9th

స్టార్ స్టూడియోస్ , ధర్మా ప్రొడక్షన్స్ , స్టార్ లైట్ పిక్చర్స్ ,ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ , అలియా భట్ జంటగా సోషియో ఫాంటసీ బ్రహ్మాస్త్ర హిందీ మూవీ 3 పార్ట్స్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ సెప్టెంబర్ 9 వ తేదీ రిలీజ్అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీ లో కింగ్ నాగార్జున , అమితాబ్ బచ్చన్ , మౌని రాయ్ , డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలలో నటించగా బాలీవుడ్ బాద్ షా అతిథి పాత్రలో నటించారు. ప్రీతం సంగీతం అందించారు.విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో రణబీర్ , అలియా భట్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీ కార్తిక్ దర్శకత్వంలో శర్వానంద్ , రీతూ వర్మ జంటగా , సీనియర్ హీరోయిన్ అమల ఒక కీలక పాత్రలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన ఒకే ఒక జీవితం మూవీ సెప్టెంబర్ 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది.కింగ్ నాగార్జున , అమల జంటగా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. నాగార్జున కీలక పాత్రలో నటించిన భ్రహ్మస్త్ర పార్ట్ 1, అమల కీలక పాత్రలో నటించిన ఒకే ఒక జీవితం మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడం విశేషం. నాగార్జున , అమల కెరీర్స్ లో సెప్టెంబర్ 9 వ తేదీ ఒక స్పెషల్ డే గా నిలిచింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 1 =