తెలుగు సినీ చరిత్రలో నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు వేసిన ముద్ర గురించి చెప్పడం ఆసాధ్యం. తెలుగు సినీ పరిశ్రమ బ్రతికి ఉన్నంతకాలం ఆయన కూడా సజీవంగా ఉన్నట్టే. ఆయన ఏ పాత్ర చేస్తే ఆపాత్ర కోసం ఆయన పుట్టినట్టు చేస్తారు. యావత్ ప్రపంచ చలన చిత్ర రంగంలోనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నెలకొల్పినన్ని రికార్డులు నెలకొల్పటం మరి ఏ ఇతర నటుడికి సాధ్యం కాదు. సాంఘికమైనా, జానపదమైనా, పౌరాణికమైనా.. పాత్ర ఏదైనా ఆయనకు నల్లేరు మీద నడకే. సాంఘిక చిత్రాలు ఎన్టీఆర్ కు నటుడిగా మంచి గుర్తింపునిస్తే.. పౌరాణిక చిత్రాలు మాత్రం ఎన్టీఆర్ ను ఆకాశానికెత్తేశాయి. పురాణాల్లో చెప్పుకునే శ్రీకృష్ణుడు, రాముడు, రావణుడు, దుర్యోదనుడు, కర్ణుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాత్రలు.. ఆ పాత్రల్లో ఎన్టీఆర్ నటిస్తే దేవుడంటే ఇలానే ఉంటాడేమో.. శ్రీకృష్ణుడు, రాముడు ఇలానే ఉంటారేమో అన్నట్టుగా ఉండేవారు. అప్పట్లో ఎన్టీఆర్ ఫొటోను పెట్టి పూజించిన వాళ్లు కూడా లేకపోలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా విజయ కేతనం ఎగరవేశారు. అన్నా అని ప్రతి తెలుగు వారు పిలుచుకునేలా చేశారు. 1982లో తెలుగు దేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన రికార్డును కూడా ఆయనే సొంతం చేసుకున్నారు. ప్రాంతీయ పార్టీల బలం ఎలా ఉంటుందో చూపించారు.
1966-67 వ సంవత్సరంలో జరిగిన క్రికెట్ టెస్ట్ మ్యాచ్ కు వెస్ట్ ఇండీస్ జట్టు భారతదేశానికి వచ్చారు. మూడవ టెస్ట్ ఆడటానకిి 1967లో జనవరి లో మద్రాసుకు వచ్చారు. ఇక ఇక్కడికి వచ్చిన వెస్ట్ ఇండీస్ కెప్టెన్ సర్ గ్యారీఫిల్డ్ సోబెర్స్ గారు ఎన్టీఆర్ ను చూడాలని అన్నారు. అప్పుడు కంచుకోట షూటింగ్ లో ఉన్నారు ఎన్టీఆర్. ఇక అక్కడ ఎన్టీఆర్ ను సర్ గ్యారీఫిల్డ్ సోబెర్స్ కలిసి చిత్రయూనిట్ తో కలిసి ఫొటో తీసుకున్నారు. ఈఫొటో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక ఈ ఫొటోలో కెప్టెన్ తో పాటు ఎన్టీఆర్, జెమినీ గణేశన్, ఉదయ్ కుమార్, సావిత్రి, ధూళిపాళ, జగ్గారావు తదితరులు ఉన్నారు. మరి ఎన్టీఆర్ పేరు ప్రఖ్యాతలు ప్రపంచ నలుమూలల్లో మారుమ్రోగాయి అని చెప్పడానికి ఇదొక ఉదారహణగా చెప్పొచ్చు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























