మీ అమ్మలతో ఒకే ఒక జీవితం సినిమా చూడండి

Aditi Rao Hydari about Oke Oka Jeevitham, Actress Aditi Rao Hydari about Oke Oka Jeevitham, Oke Oka Jeevitham Telugu Movie Review,Oke Oka Jeevitham Movie Review,Oke Oka Jeevitham Review,Oke Oka Jeevitham Telugu Review,Oke Oka Jeevitham Movie Review In Telugu,Oke Oka Jeevitham,Oke Oka Jeevitham Movie,Oke Oka Jeevitham Telugu Movie,Oke Oka Jeevitham Review - Telugu,Oke Oka Jeevitham Movie Reviews,Oke Oka Jeevitham - Telugu Movie Reviews,Oke Oka Jeevitham Movie Public Talk,Oke Oka Jeevitham Movie Public Response,Oke Oka Jeevitham Movie Updates, Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మొత్తానికి మంచి హిట్ ను సొంతంచేసుకున్నాడు. చాలా కాలం నుండి శర్వాకు హిట్ లేకుండా పోయింది. వరుసగా సినిమాలు అయితే చేసుకుంటూ వెళుతున్నాడు కానీ సరైన హిట్ చూసి చాలా రోజులే అవుతుంది. దీంతో శర్వా కూడా ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇన్ని రోజులకు తను వెయిట్ చేసిన దానికి ఒకే ఒక జీవితంతో ఫలితం దక్కింది. టైం ట్రావెల్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి తల్లి సెంటిమెంట్ ను కూడా కలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈసినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి టాక్‌తో దూసుకుపోతుంది. విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను చూసిన అదితీ రావు హైద‌రి కూడా సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. ఒకే ఒక జీవితం సినిమాతో నాకు కన్నీళ్లు తెప్పించి..నా హృదయాన్ని నవ్వించినందుకు ధన్యవాదాలు. విశ్వంలో అత్యంత ముఖ్యమైన వ్య‌క్తి గురించి సినిమా తీసినందుకు థ్యాంక్స్. అమ్మలు నిజంగా ప్రపంచాన్ని ఉత్త‌మ ప్రదేశంగా మారుస్తారు..ఇలాంటి సినిమాలకు మీ అమ్మ‌ల‌ను తీసికెళ్లి చూడండి అని ట్వీట్ చేసింది.

శ్రీ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో శర్వానంద్ హీరోగా నటించగా రీతూవర్మ హీరోయిన్ గా నటించింది. అమల, వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి, ఆలీ, మధు నందన్ కీలక పాత్రల్లో నటించారు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ పై ఎస్ ఆర్ ప్ర‌కాశ్ బాబు, ఎస్ ఆర్ ప్ర‌భు ఈసినిమాను నిర్మించారు. జెక్స్ బిజోయ్ సంగీతం అందించగా.. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.