బిగ్ బాస్ 6 మొదటి కెప్టెన్ గా మిస్టర్ కూల్

Bigg Boss Telugu 6 Baladitya becomes the captain, Baladitya becomes the captain, Baladitya becomes first captain of the season 6, Bigg Boss Telugu 6 captain, Bigg Boss Telugu season 6 captain, Baladitya becomes first captain Of Bigg Boss Telugu season 6, Bigg Boss Telugu Season 6 Highlights, Bigg Boss Highlights, Baladitya, Bigg Boss captain, Bigg Boss Telugu Season 6 Live Updates, Bigg Boss Telugu Season 6, Bigg Boss Season 6, Bigg Boss Telugu, Bigg Boss Telugu 6, Bigg Boss, Bigg Boss 6, Bigg Boss Season 6 eliminations, Bigg Boss eliminations, This Week eliminations, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

బిగ్ బాస్ 6 లో ఐదు రోజులు పూర్తయిపోయాయి. ఇక మొదటి రోజు నుండే గొడవలతో మొదలైన బిగ్ బాస్ సీజన్ 6 అదే కొనసాగుతూ వస్తుంది. ఇక మొదటి నాలుగు రోజులు పలు ఆటలు ఆడించిన బిగ్ బాస్ ఫైనల్ గా ఈ సీజన్ మొదటి కెప్టెన్సీ టాస్క్ నిర్వహించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈకెప్టెన్సీ టాస్క్ కు క్లాస్ టీమ్ లో ఉన్న నేహా, ఆదిరెడ్డి, గీతు డైరెక్ట్ గా పోటీదారులుగా ఎంపికయ్యారు. మాస్ టీమ్ నుండి కూడా కెప్టెన్సీ టాస్క్ లో పోటీ చేసే అవకాశం ఉండగా ఆనిర్ణయాన్ని టీమ్ సభ్యులకే వదిలేస్తాడు బిగ్ బాస్. మాస్ టీమ్ లోని సభ్యులు ఏకాభిప్రాయంతో మరో ముగ్గురిని ఎంపిక చేయమని అడుగగా.. వారిలోనుండి బాలాదిత్య, సూర్య, మెరీనా-రోహిత్ లను ఎంచుకుంటారు టీమ్ సభ్యులు. దీంతో ఆదిరెడ్డి, బాలాదిత్య, నేహా, సూర్య, మెరీనా- రోహిత్‌లు, గీతు కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారు.

ఈ కెప్టెన్సీ పోటీదారులకు కెప్టెన్సీ బండి అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. టాస్క్ ఏంటంటే.. నీళ్లలో వేసిన తాళం చెవిని నోటితో తీసి.. ఆ తాళంతో బాక్సులు ఓపెన్ చేసి.. వాటిలో ఉన్న నెంబర్స్ ను చూసుకొని కారు నెంబర్ గా పెట్టాలి. అయితే ఒక బాక్స్ తరువాత ఒకటి ఓపెన్ చేయాలి. ఈ టాస్క్ లో కెప్టెన్సీ పోటీదారులకు మిగిలిన ఇంటిసభ్యుల్లో ఒక్కొక్కరికీ ఇద్దరు సపోర్ట్ చేయొచ్చు. ఎవరు ముందు కారు పూర్తి నెంబర్ పెడతారో వారే కెప్టెన్. ఈ టాస్క్ కు ఫైమా సంచాలకురాలిగా వ్యవహరించింది. ఇక టాస్క్ లు అన్న తరువాత గొడవలు తప్పవు కాబట్టి ఈ టాస్క్ లో కూడా గొడవలు తలెత్తాయి. ఇక ఎవరికి తోచినట్టు వారు టాస్క్ పూర్తి చేశారు. చివరిగా బాలాదిత్య కెప్టెన్సీ టాస్క్ లో గెలుస్తాడు. దీంతో ఈ సీజన్ మొదటి కెప్టెన్ గా బాలాదిత్య ఎంపిక అవుతాడు.

ఇక కెప్టెన్సీ టాస్క్ అయిపోయింది. అన్ని సీజన్స్ లో లాగే వారం చివరిలో వరస్ట్ పర్ఫామర్ ను ఎంచుకునే టాస్క్ ఈ సీజన్ లో కూడా ఇచ్చాడు. ఇక ఈ ప్రక్రియలో ఎక్కువ ఓట్లు గీతుకే రావడంతో గీతుని వరస్ట్ కంటెస్టెంట్‌గా ఎంపిక చేస్తారు. బిగ్ బాస్ ఆదేశం మేరకు ఆమెను జైలులో వేశారు.

కాగా మొదటి వారం నామినేషన్స్ లో రేవంత్, చంటి, ఫైమా, ఇనయ, అభినయ, శ్రీసత్య, ఆరోహి ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే సండే వరకూ వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 16 =