ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు

Aa Ammayi Gurinchi Meeku Cheppali Pre Release Event Details, Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Pre Release Event, Aa Ammayi Gurinchi Meeku Cheppali Telugu Movie Pre Release Event, AAGMC's pre-release event, Indraganti Mohanakrishna, Sudheer Babu, Krithi Shetty, Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie, Aa Ammayi Gurinchi Meeku Cheppali Telugu Movie, Aa Ammayi Gurinchi Meeku Cheppali Pre Release Event, Aa Ammayi Gurinchi Meeku Cheppali Latest Update, Aa Ammayi Gurinchi Meeku Cheppali, Aa Ammayi Gurinchi Meeku Cheppali 2022, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

సమ్మోహనం, వి సినిమాల తరువాత ఇంద్రగంటి మోహనకృష్ణ, సుధీర్ బాబు దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనానే ఉన్నాయి. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో కూడా స్పీడు పెంచారు మేకర్స్. ఇప్పటికే విడుదల చేసిన ఈసినిమా పోస్టర్లు, టీజర్‌, పాటలు అలానే ట్రైలర్ పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ కావడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రమోషన్స్ లో భాగంగానే ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించనున్నారు. ఈమేరకు వేదిక కూడా ఖరారు చేశారు. సెప్టెంబర్ 13వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌ లోని జేఆర్‌సీ కన్వెన్షన్స్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఇక ఈ ఈవెంట్ కు అతిథులుగా పలువురు హీరోలతో పాటు యంగ్ డైరెక్టర్లు కూడా చాాలామంది వస్తున్నారు. హీరోలు అడివి శేష్, నాగ చైతన్య, సిద్దు జొన్నలగడ్డతో పాటు డైరెక్టర్లు అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, పరుశురాం, వెంకీ కుడుముల ఇంకా రాహుల్ సంకృత్యన్ ఈ కార్యక్రమానికి రానున్నారు.

ఇక ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, గోపరాజు రమణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక రీసెంట్ గానే మైత్రీ మూవీ మేకర్స్ కూడా భాగమయ్యారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. పిజి విందా కెమెరా మెన్‌గా పనిచేస్తున్నారు. ఇక సెప్టెంబర్‌ 16న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈసినిమా వీరికి హ్యాట్రిక్ అందిస్తుందో లేదో చూడాలి?

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 2 =